20130918

వరంగల్లు

"ఓరొ"క్కటి "గల్లూ"రు

బతుకంటే బతుకు నాది బతుకమ్మల బతుకు ,
జాగంటే జాగ నాది బోనమెత్తిన జాగ. 
సమ్మక్క సారక్కలు , సాకలి ఐలమ్మలు ,
రాణులకే రాణులు రాణి రుద్రమ్మలు.
వడ్డేపల్లి , పాకాల, లక్నవరం, భద్రకాళి, రామప్పలు
పంచ వర్ణ శోభితాలు.

ద్వాదశ మొదలు చతుర్దశ కాకతీయ పాలితం
ద్వి శతేండ్ల మహా దివ్య చరితం.
గణపతి దేవుని మొదలు రౌద్రం గల వంశమది
తెలుంగును పన్నీరుగా చేసి పంచిన  తెలంగాణమది
ఆనాడే వెలిసేను మా గాణము ఘనముగా
కన్నడిగుల నామమది "ఓరొ"క్కటి "గల్లూ"రు  
 ఏకశిలా నగరమే మనది నేటి వరంగల్లు.

 శిల్పకళ శిళా తోరణమే తెలంగాణా కళల దర్వాజా
వెయ్యి స్తంబాల గుడి మా కోటి పుస్తకాల బడి,
దిశా దిక్కులను చూపే స్థితి స్తంభాలే మొదటి పడి
 నీటిలోన తేలియాడే రాతి గుడి రామప్ప ,
స్వరాలొలికించే స్తంభాలా రాణా రుద్రసమనీంద్రజాలం .
నందీశ్వరుడు చాలొక్కడు నివ్వెరపోయి చూడ
అతిలోక సుందరీ మనులనే తనలో ధరించిన ఖిలా వరంగల్
దేవేంద్రులనే శిల్పించిన రేచర్ల రుద్రుని పాలంపేట.

 ఏటూరు నాగారం వన సంపద
ఆది కవి సోమన్న శతానాదాలు,
వానమామలై వరదన్నపద్యాలా వరదలు ,
 ప్రజా కవి కాళన్న కవితా నారాయణులు,
ఓరుగల్లె కదా అరవై నాలుగు కళల ఖజానా.

జై తెలంగాణ జై జై తెలంగాణా                                

20130917

ఓ కళాకారుడా ...

ఓ కళాకారుడా ... 

కళనే కళ గా గుర్తెరగనప్పుడు,
ఏమిరా నీ  కళ లోని సౌందర్యం. 
సంపదనే కళగా గుర్తెరిగినప్పుడు ,
 ఎవడినానందపరుచు నీ కళలోని రూపమ్ము.
ఈ ధూమ సమాజం ఏ కవికిచ్చు దేహ గౌరమ్ము ?

 ఓ కళాకారుడా ... ఓ చిత్ర కారుడా ...
ఏ చిత్రమైన నీ జీవిత చట్రాన్ని మార్చింద ?
మద్య తరగతి పోరు ఇసుమంతైనను,
 సాగర మదనం తో తూగునయ .
మేట్లేన్ని ఎక్కినను, మాటలెన్ని పొందినను,
పాదమ్ము మట్టి తోక్కక మానదయా .
మర్మ మెరగరా సిత్ర కారుడ  నా విచిత్ర సోదరా ...

ఓ కళాకారుడా .. ఓ కవి పుంగవా...
నిను మోయగ లేదు, నిను కాపాడగ రాదు,
ఎవనికెంత చెప్పిన అవగతమవగనూ రాదు ,
అవసరమేమున్నదయ ఎవనికేమి జెప్ప .

శొదించి కళ సాధించిన గాని ,
 సంపాదించగ లేని కళ ఉండగనేమి అది ఉడగనేమి ?

కవితలెన్ని రాసినా కంచం నింపగా లేదు
బొమ్మలెన్ని గీసినా ఏ బొమ్మ దరికి చేరగా రాదు
పాట లెన్ని పాడినా పుట గడవబోదు.
ఆటలేన్ని ఆడినా అలసి పోక తప్పదు , అటకెక్కక మానవు .

పొట్ట నింపని కళను పట్టించుకొను వాడెవ్వడు ?
పట్టువిడవక ధీరుడు పొట్ట చేతపట్టు వాడెవ్వడు ?
కల చేతపట్టి కలకాలం బతుకుట కంటే ,
ధనం చెంత చేరి కొంత కాలం బతుకుట మేలయా ..
అతి సామాన్యుడ నేనయా ...

 కళ కను గొన గల ప్రయాణం సుదూరం
కళ గల హృదయం కఠిన సున్నితం
కళ గన లేని హృదయం కఠినాతి కఠినం
ఈ శతాబ్ది కిదే జగమెరిగిన మర్మం .

ప్రోత్సహించని చోట ప్రోద్భలము దొరకునా ?
విలువ లేని చోట పువ్వై విచ్చు కొందువా ?
కళల మద్య బతకలేవు మద్య తరగతి వాడిగా ,
కళని చంపి బతుకు చచ్చిన శవంగా ...

పంపకాలు

పంపకాలు 

ముద్దు ను పంచుకున్నం మురిపెం పంచుకున్నం
మాటని పంచుకున్నం, మమతని పంచుకున్నం
కోపాన్నిపంచుకున్నం,  క్రోధాన్ని పంచుకున్నం
నవ్వును పంచుకున్నం, నష్టాలను పంచుకున్నం.
కష్ట సుఖాలను, వెలుగు నీడలను
మొలిచిన మొక్కలను, పెరిగిన కొండలను
హిమాలయాలను, హిమని నాదాలను
కట్టే గోడను , కొట్టే చెట్టును
రాలే ఆకును , పూసే పూతను, కాసే కాతను
రాలే పిందెను పండే పండును పంచుకున్నం
తినే కంచాన్ని తాగే గ్లాసు ను , పోయే పాయకానను
భారతం  లో ఏకంగా భార్య నే పంచుకున్నం.
ఉరిలో దేవుణ్ణి పంచుకున్నం.
ఉరి చివర స్మశానాన్ని పంచుకున్నం.
పంపకాలు జరగని దెక్కడ ? పంచలేని పంచ భూతమేక్కడ ??
పగిలిన పలక విరిగిన బలపం , పంపకాలకు కాదేది అతీతం .
పంపకం లేనిదే పరిహారం ఉంటుందా ? సమస్యకు పరిష్కారం వస్తుందా ?

జై తెలంగాణా జై జై తెలంగాణా

నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా .

నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా

రాతి మనిషి వాడు రాటు దేలినోడు
తిని బతకక వాడు తిక్క వేషమేసిండు .
రాజజే సరైనోడు వాణ్ని మెడ వట్టి దొబ్బిండు ,
ముల్లెలన్ని ముట  గట్టి ముంత వట్టుకొచ్చిండు .
పిచ్చోడు వాడు పిట్టల దొరవొకడు,
భాషోక్కటన్నాడు , భందమేసుకున్నాడు,
బంజరు భూముల్లో జేరి బల్ల గుద్దుతున్నాడు ,
బద్మషు బాబు వాడు , బతకనేర్సినోడు ,
నా జాగల బొక్కేనేసి అడుగునంత తోడిండు .
కాలుకేసి ఏలుకేసి ఉన్నదంతా ఉడ్సిండు .
వెనుకటి కాలనికొకడు వేర్రిబాగులోడు ,
నోరు  మెదపనూ లేదు , కాలు కదపనూ లేదు
కన్నీరోడుతున్న కనికరించనూ లేదు .
మొండోడు వాడు మోడు బతుకు వాడిది .
అరవయ్యేళ్ళ అభివృద్ధి పేరు జెప్పి అరిగోస పడుతున్నడు.
 కిరాయికి అచ్చినోడు కిరికిరి జేసి కిరీటం నదంటున్నడు.
ఊరి కొస్సకు కూసోని ఊరు నాదంటున్నడు.
తెగిన్చినోడు వాడు తెగ బలిసినోడు ,
 అయ్య పేరు జెప్పి వాడు ఐకుంటం ఎక్కినాడు .
మాట మర్చినవాడు నేడు చిప్ప కూడు తింటాండు .
కుతుబ్షాహిలు , మొగలసఫ్ జాహీ లు
నాల్గొందలేండ్ల లో వాడేనాడు జోచ్చిందో ?
 ఎవడబ్బ సొమ్మని రామచంద్రా వాడు నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా .
ముదనష్ట పోడు వాడు ముస్టడుగుతున్నడు.
హిందీ అంటే రానోడు ఉర్దంటే పడనోడు,
ఉండబట్టలేక వాడు ఉమ్మడంటున్నడు.
పాపమని పాలిస్తే , పొదుగు నదంటండు .
పుక్యానికి అచ్చినోడు పబ్బం గడుపు కున్నడు .
పని పాట లేక వాడు , పట్నం నాదంటున్నడు...

జై తెలంగాణా జై జై తెలంగాణా ...

20130909

నేను పెట్టిన గులాబీ మొక్క

నేను మీ అందరికి ఒక కథ చెప్తాను ...
కథ కి పేరు ఉండాలి కదా ...

 హా నేను చెప్పే కథ పేరు "నేను పెట్టిన గులాబీ మొక్క "


ధ్యానం ... ధ్యానం వలన ఏకాగ్రత ...
               ఏకాగ్రత అంటే చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం . చేస్తున్న పని మీద కాకుండా మరి మనం ఇంకెక్కడ దృష్టి పెడుతున్నాం ?
ఆలోచనలపై , మెదడు కంటున్న కలలపైన ...

            ఏంటి "నేను పెట్టిన గులాబీ మొక్క " అని చెప్పి మెదడు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ??

సరే ...
         
              అది వర్షాకాలం . కాలేజీ లో అందమైన గులాబీ మొక్కకున్న పువ్వుని చూసి నాకు చాలా ముచ్చటేసింది . అమ రూం ముందున్న ఖాళి స్థలం లో ఈ మొక్క ని పెడితే బాగుండు అనిపించింది . ఆలోచనే తడవుగా ఒక కొమ్మని తిస్కోచ్చాను . అప్పటికే ఆ ఖాలీ స్థల;అం అంత పిచ్చి మొక్కలతో నిండి పోయింది . అందులో నేను ఒక మంచి స్థలం చూసి మొక్కని  నాటాను . వర్ష కాలం కదా నీళ్ళు పట్టాల్సిన అవసరం కూడా లేదు .

        తెల్లారి లేవడం ఆ మొక్కని చూడడమే చిగురించిందేమో అని , లేదు రెండో రోజు కూడా మూడో  రోజు కి ఆ మొక్క ఇంకా పచ్చి గానే ఉంది . దాని చుట్టూ ఉన్న పిచ్చి చెట్లు చాలా ఎత్తు పెరిగాయి .

         మాకు రూం ఇచ్చిన ముసలమ్మా ఒకసారి రూం చూద్దామని వచ్చింది . రూం ని శుబ్రంగా కడిగేసింది . చెత్తంతా ఎత్తింది . గుహలా ఉన్న మా రూం ని ఇల్లుల మార్చింది . మద్యాహ్నం కాలేజీ కి వెల్లొచ్చెసరికి రూం ముందున్న పిచ్చి చెట్లన్నింటిని పీకేసింది ... పీకేస్తుంటే ఓ మొక్క ముళ్ళు కుచ్చిందట ... అది నా గులాబీ మొక్కనే ... మిగిలిన మొక్కలని పీకేస్తూ వాటి వేర్లకున్న మట్టిని దులిపి ఆ పిచ్చి మొక్కలని బయట పడేస్తుంది .

నేను పెట్టిన గులాబీ మొక్క చిగురించలేదు మరణించలేదు కాని ... పిచ్చి మొక్కల్లనే ...

            మొదట్లో నేను చెప్పిన మెదడుకి ఈ పిచ్చి మొక్కలకి సంబంధం ఉంది . మన మెదడు కూడా భూమి లాంటిదే . ఆ మెదడు పైన పిచ్చి ఆలోచనలు కూడా చాల మొలుస్తాయి . వాటి వాళ్ళ అంత గ ప్రయోజనం కూడా ఏమి ఉండదు , సారాన్ని తినడం తప్ప . మనం చేయాల్సిన పని కూడా గులాబీ మొక్క లాంటిదే . ఆ మొక్క కంటే ముందు ఆ పిచ్చి ఆలోచనలే వేగంగా విస్తరిస్తాయి . అందుకే నేను ఎంతో ప్రేమతో పెట్టిన నా గులాబీ మొక్క కి విలువ లేకుండా పోయింది పిచ్చి మొక్కల్లాగే ...

           మల్లి ముసలమ్మా రావాలి నా మెదట్లో ఆలోచానలన్ని పీకి , వేర్లకున్న మట్టిని దులిపి బైట పడేయాలి . గుహల ఉన్న నా మనసుని గుడిలా మార్చాలి ...

       అప్పుడే నా పనికి నా మొక్క కి విలువోస్తుంది . చిగురిస్తుంది .
అందమైన , సువాసనలు విరజిమ్మే మొగ్గ తొడుగుతుంది . పువ్వు గా మారి పరిమలిస్తుంది. 

నేను కీర్తి శేషుడను



ఈ జీవితం చివరి రణ  రంగం లో
 నా పాపాలన్నింటిని చన్నీళ్ళతో కడిగేసారు .
పతవాన్ని బాగుండగానే
 కొత్త బట్టలు తొడిగించారు.

మరణం అనే రధాన్ని
ఎనిమిది కాళ్ళతో
నలుగురు స్వారీ చేస్తున్నారు .
నాపై తెల్లని గుడ్డ కప్పి
మరక లేని మనిషిని చేసారు .

ఏడిచే వాళ్ళు కొందరు ,
ఏడుపు రప్పించే వాళ్ళు ఇంకొందరు .
నన్ను ఇన్నాళ్ళు ఏడిపించిన వాళ్ళు
నాకోసం ఏడుస్తూ
నాకు నవ్వు తెప్పించేలా చేస్తున్నారు .

నేను రానని రాలేనని తెలిసి
నా బందు మిత్రులందరూ నా పేరు ను
పిలిస్తున్నారు.
తలుస్తున్నారు ...

నాకు నిద్ర పట్టదని తెలిసి
కట్టెలపై నే పడుకో బెడుతున్నారు .
నాకు నిప్పంటే భయమని తెలిసీ ,
 నిప్పంటిచ్చేస్తున్నారు .
ఒంటరి తనాన్ని భరించ లేనని తెలిసీ,
 ఒంటరి గా వదిలేసి వెళ్తున్నారు .

నా నిండు దేహాన్ని
నిర్దాక్షిన్యంగా కాల్చేసి,
బొమ్మకి బొట్టు పెట్టి,
గోడకి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

నా పునః నామకరణ
మరణ మహోత్సవానికి
పత్రికలచ్చు వేయించి,
అందరిని ఆహ్వానిస్తున్నారు...

               ఇప్పుడు నేను కీర్తి శేషుడను ...

అయోమయం

అయోమయం 

 నేనొక ఆత్మ ని ... 

పాత  బంధాలను మరచి కొత్త బంధాల లోకి నెట్టి  వేయబడుతున్నాను .
దవాఖానా జాతరలా నిండిపోయింది ...
నాకు అయిన వాళ్ళు , నాకు కాబోయే వాళ్ళు నన్ను చూడడానికే వస్తున్నారు ...
కాబోయే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు మెదులుతుంది. 
నా వాళ్ళంతా బోరున విలపిస్తున్నారు ...
ICU లో డాక్టర్లంత నాకు ప్రాణం పోసే పనిలో పడ్డారు .
మరి కొందరు ప్రాణం నిలిపే పనిలో పడ్డారు .
నేను మాత్రం చీకటి వెలుగులను చీల్చుకుంటూ బయట పడాలనే చూస్తున్నా ...

చీకటి గూటికి చేరుతుంది ...
మసక బారిన ఆశలన్నీ మదిలో చేరబోతున్నాయి .
మదిలో మెదిలిన ఆశలన్నీ మసక బారుతున్నై .
ఆలోచనలన్నీ ఉవ్వెత్తున ఎగరబోతున్నై .
ఉవ్వెత్తున ఎగిరే ఆలోచనలన్నీ తీరాన్ని తకుతున్నై
ఊపిరి వేగం తగ్గుతుంది ...
వేగంగా వీచే గాలి ఊపిరిగా మారబోతుంది
గల గల మాట్లాడే గొంతు మూగ బోయి ,
దేహ దహన నూతన దేహానందం తో కేరు మంది నా ఆత్మ ...

20130903

డాలర్

కాపాడండి...   కాపాడండి...
మన దేశ ఆర్దిక వ్యవస్థ క్షీణించింది ...
రూపాయి రూపం పోయింది...
మారకం మరణ శయ్య పై ఉంది ...
కానీ కానీ ఎవరితో పోటి పడి నా దేశ ఆర్దిక వ్యవస్థ క్షీణించింది...
అసలు ఎవరి అందాన్ని చూసి  నా రూపాయి రూపం పోయింది ?
డాలర్ విలువనా ? డాలరేనా ???
భారత దేశానికి దారి కనుకుందాం అనుకుని దురదుష్ట వశాత్తు కనుకున్న  దేశామేనా అది ?
ఒక వంద సంవత్సరాల క్రితం ఎక్కడున్నావో నీకు తెలుసా ??
కానీ నేను మాట్లాడడం  మొదలు పెడితేనే వెయ్యి సంవత్సరాల వెనక నుండి ...
కోటి సంవత్సరాల చరిత్ర గల దేశం నాది ...
నూట ఇరవై కోట్ల జన  సంచారం గల దేశం నాది...
 నాలుగు మతాలు పుట్టిన దేశం నాది...
వేటితో పోటీ పడగలవని నీతో పోల్చుకోవాలి ?



20130815

ఎగిరి పోవాలని ఎగురుతున్నది మూడు రంగుల జెండా

ఎగిరి పోవాలని  ఎగురుతున్నది మూడు రంగుల జెండా

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

తలలు తెగిన జవాన్ల రక్తం తో ఎరుపెక్కి ఎగురుతున్నది,
బాడర్లో చచ్చే బిడ్డలను చూస్తూ చావలేక ఎగురుతున్నది,
ఉగ్రవాదుల బాంబు దాడులు భరించలేక చెవ్వులు మూసుకుని ఎగురుతున్నది, 
బలం లేని రక్షణ బలగాలను చూసి బలహీనపడి ఎగురుతున్నది,
  

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 


స్వార్ద రాజకీయుల చేతుల్లో ఉండలేక ఊడిపోవాలని ఎగురుతున్నది,  
విదేశీ ఆక్రమణలు జరుగుతున్నా తనకేం పట్టనట్టు తెల్ల మొహం వేసుకుని ఎగురుతున్నది ,
చేతగాని ప్రభుత్వాలతో చేసేది ఏమి లేక చేతులు ముడుచుకుని ఎగురుతున్నది,  
అవినీతి కోరలు చాచిన అప్రజాస్వామికత ను చూసి అసహ్యించుకుని  ఎగురుతున్నది,
కంపు కొట్టే కుంభకోణాలను చూడలేక కళ్ళు మూసుకుని ఎగురుతున్నది. 


ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 


మానవత్వం లేని ఈ మనుషుల మద్య ఉండలేక మబ్బుల్లో ఎగురుతున్నది,  
కన్న వాళ్ళను వదిలేసి పరాయోల్లతో కునికె కసాయోల్లను చూసి కన్నీటితో ఎగురుతున్నది, 
పట్టెడన్నం కుడా  దొరకని వీది బాలల గోడు వినలేక విసిగిపోయి ఎగురుతున్నది, 
పెరుగుతున్న నిరుద్యోగులని చూసి నివ్వెరపోయి నిస్సహాయంగా ఎగురుతున్నది.
రైతుల ఆత్మహత్యల తో, తన లో పచ్చదనం తగ్గిపోయి ఎగురుతున్నది. 

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

మందు మత్తులో మునిగి తేలుతున్న యువతరాన్ని చూసి ముక్కు మూసుకుని ఎగురుతున్నది, 
కామాందుల కంట పడకుండా తన దేహాన్ని దాచుకుంటూ సిగ్గుపడి  ఎగురుతున్నది,
ఆడ బిడ్డలా బౄణ హత్యలు చూసి, తనదీ ఆడ జాతేనని అందకుండా ఎగురుతున్నది,
వంద కోట్ల భారతీయుల భవిష్యత్తు ను తలిచి బాధ పడుతూ భయపడి ఎగురుతున్నది. 


ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

















20130812

మోడీ

 ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మోడీ పై చేసిన వాక్యలు ...
పొట్టేలు, కొండను  ఢి  కొట్టినట్టు ఉంది...
అయిన మేక పోతు గాంభీర్యం ప్రదర్శించటం మన CM గారికి బాగా అలవాటయింది ఈ మద్య కలం లో...  ఏమంటారు ???  

20130804

సమైక్యం


సమైక్యం , ఐకమత్యం ... ఐక మత్యమే మహా బలం అని నేను ఒప్పుకుంటాను కానీ అది కొన్ని సందర్బాలల్లో మాత్రమే ...
ఐక మత్యమే మహా బలం అయితే మహాత్మా గాంధీ గారు, మహమ్మద్ జిన్నని గళ్ళ పట్టుకుని ఎందుకు ప్రశ్నిచలేదు మనం కలిసే ఉందాం అని  ?
సమైక్యమే బలం అయితే ఆంధ్రులు , తమిళులతో ఎందుకు కలిసుండలేక పోయారు ?
భాషే బలం అయితే కొరియా రెండు దేశాలు గ ఎందుకు విడిపోయింది  ?
అందరం మనుషులమే అయితే మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నట్టు ?
అందరు సమానమే అయితే ఇన్ని యుద్దాలు ఎందుకు జరుగుతున్నాయి ?
ప్రాంతాలన్నీ ఒక్కటే అయితే ఈ ప్రపంచం ఇన్ని దేశాలు గా ఎలా ముక్కలయింది ?
ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఎలా పుట్టుకొచ్చాయి ?

సమైక్యమే బలం అంటే, ఎవడి ఇంట్లో వాడు ఉండడం ఎందుకు ? సామూహిక వంటలు , సామూహిక నిద్ర పోవచ్చు కదా ...

ఒక జాతి నిరాదరణకి , నిర్లక్షానికి గురై నప్పుడు లేదా ఒక నిమ్న జాతి పై మరో జాతి ''పెత్తనం, అజమాయిషీ''
చలాయిన్చినప్పుడు...  ఆ జాతి నుండి ఉత్పన్నం అయ్యే వ్యతిరేకతే "విప్లవం " "ఉద్యమం ". 

అలా కసి తో  పుట్టుకొచ్చిన ఉద్యమం  , ప్రాంతం భాష  బందాలను వేటిని లెక్క చేయదు.

ఇకపై ఒకే భాష మనది , ఒకే రాష్ట్రము మనది అని సన్నాసి కబుర్లు చెప్పే వాడికి ఇది నా హెచ్చరిక ...  

చదువుకోడం


నాకు తెలిసి చదువుకోడం అంటే చాలా కష్టం అని , కానీ అంత కస్టపడి చదివిన నాకు ఆ చదువు ఎందుకు చదివానా అని సిగ్గుగా ఉంది . ఎవడి చరిత్రనో నా నోటితో చదివించి చదివించి , నాకు చరిత్రే లేనట్టుగా  చేసారు .
బందరు వెళ్ళిన నాన్న లు బొమ్మలు తెచ్చారే గని , దుబాయ్ వెళ్ళిన ఎంతో మంది నాన్న లు ఏమి తేలేదేందుకు ?

కృష్ణ దేవరాయల గొప్పదనాన్ని చూసాను గని , నవాబుల నిరకుశత్వాన్ని  నాకెవరు చూపలేదు ?
వికట కవి అని ఉప వాచకాల నిండా ఉంది  కానీ , కాకతీయ రాజుల గురించి వారి సామంతుల గురించి ఎక్కడ లేదు .
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న విగ్రహాల గురించి చెప్పారే తప్ప , ఆ సాగర్ ని తవ్విన్చినో డి ని మాత్రం కనీసం తలవనుకుడా తలవలేదు ...
ఎక్కడో ఒంగోలు లో పుట్టిన ప్రకాశం పంతులు మా పుస్తకాలల్లో ప్రాణం పోసుకున్నాడు గని ,ఆదిలాబాద్ లో పుట్టిన  కొమురం భీమ్ మాత్రం పుస్తకాలల్లో ప్రాణం పోసుకోలేదు .

చీరాల పేరాల పోరాటం గొప్పది అయినప్పుడు , జగిత్యాల జైత్రయాత్ర ఎందుకు గొప్పది కాలేదు ?

సర్ అర్ధర్ కాటన్ బ్రిడ్జి గురించి రాసారు గని , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేదేమో మరి ?

నా రాష్ట్రము అన్న పూర్ణ అని గోదారి జిల్లాల గురించి చెప్పినప్పుడు , సహజ వనరుల జిల్లాలు ఆదిలాబాద్ , ఖమ్మం ల గురించి చెప్పలేదు .

విజయ వాడ  కనక దుర్గ కి దక్కే గౌరవం , మా బాసర సరస్వతి కి దక్కదు .
ఇంకా వేములాడ రాజన్న , కొండగట్టు అంజన్న లయితే ఆడికాడికే...

జెండా రూపకర్త  గని , ప్రతిజ్ఞ రాసిన నల్లగొండ వాడు మనోడు కాకుండా పోయాడా ?

 నాకిప్పుడే అర్ధం  అయితంది , నేను చిన్నప్పుడు తిన్న జొన్న గడుక ,జొన్న అంబలి ఇప్పుడు ఇడ్లి లుగా  ఎలా మారాయా అని , సింగరేణి బాయి ల మీద ఉన్న పోచమ్మ , మైసమ్మ లు నేడు కనక దుర్గలు గ ఎలా మారారు అని ,
ఆనిక్కాయకు రెండు పేర్లు ఉన్నాయని మురిసి పోయాను గాని , ఇంకో పేరు పరాయోడి పెత్తనపు రుద్దుడని అర్ధం అయింది .

మీ పాదాలు కడగడానికే


తెలంగాణా లో ఇప్పుడు కురుస్తున్నది వర్షం  కాదు ,
 నాకు తెలుసు అమరులారా అవి మీ   ఆనంద భాష్పాలని .
 ఈ వీచే చల్లని  గాలులు నాకు తెలుసు మీ ముసి ముసి నవ్వులని ,
నాకు తెలుసు మీరే  ప్రవహించె నది  నీళ్లై ఈ స్వేచ్చా భూమిని తనివి  తీరా స్పృశిస్తున్నారని,
 ఈ కమ్ముకున్న కారు మబ్బులు, నాకు తెలుసు  మమ్ములను మీ గుండెలకి హత్తుకున్న క్షణాలని,
నాకు తెలుసు  రాలుతున్న ఆకులన్నీ ఈ జాగను ముద్దాడే మీ పేదాలని ,
 నా  అన్నలారా తెలంగాణా  వీరులారా,నాకు తెలుసు  నా కళ్ళ లో గిర్రున తిరిగే ,
కన్నీరంతా మీ పాదాలు కడగడానికేనని...
జై తెలంగాణ జై జై తెలంగాణా ...

బానిస సంకేల్లు


60 ఏళ్ళ బానిస సంకేల్లు తెగే క్షణం . 
గొంగలి పురుగు, బస్మంత అయ్యే క్షణం
గుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షి రెక్కలు విప్పే క్షణం .
 రెక్కలు తొడిగిన పక్షి  విహంగానికి ఎగిరే మధుర క్షణం ...
నా స్వప్నం నా రాష్ట్రం  పురుడు పోసుకుంటుంది ...
ఈ దేశానికి 29 వ బిడ్డ గ జన్మించబోతుంది నా తెలంగాణా

20130715

Rahul Gandhi

అధినేత్రి కొడుకు, ఒక M.P , పైగా 10 సంవత్సరాలు  అధికారం లో ఉంటూ...
తన మార్కును, ప్రతిభను చూపని, దేశాభి వృద్ధి కి ఏవిదంగా సహాయం చేయలేని  ఒక వ్యక్తి,
ప్రధాన మంత్రి గా ఈ దేశాన్ని ఉద్దరించగాలడా  మరి ?   

నేనొప్పుకుంటాను భారత దేశానికి ఒక యువ ప్రదాని కావాలని,
అలా అని 43 సంవత్స రాల  ఒక దద్దమ్మని ప్రధానిని చేస్తే మాత్రం భరింఛి, సహించడానికి ఈ దేశ  పౌరులు సిద్దం గా లేరు .

20130515

ఏది నా అభివృద్ధి

ఏది నా అభివృద్ధి 

నా ఆర్ధిక అభివృద్ధి , నా మానసిక ఆనదానికి ఆటంకం కలిగిస్తుందంటే... 
అలాంటి ఆభివృద్ధి వైపు  నా పాదాలు ఒక్క అడుగు కూడా వెయవు... 

ఈ  దేహానికి నా మనసుతో కూడా సన్నిహితంగా ఉండే సమయం లేదంటే...
నా మనసుని అనుభవించే అదృష్టాన్ని ఒక్క క్షణం కూడా  ఏ దేహానికి  ఇవ్వబొను... 

నా దృష్టిలో ఇద్దరే ఇద్దరు దరిద్రులు... 
ఒకరు తినడానికి తిండి లేని వాడు,
ఇంకొకడు ఆ తిండి తినడానికి సమయం లేని వాడు... 

20130430

విప్లవం

ఈనాడు మనం అనుభవిస్తున్న ఫలాలన్నీ,
ఏనాడో  విప్లవం నాటిన విత్తనాలే...

అనుభవించే వాళ్ళంతా బకాసురులైతే,
విప్లవ విత్తన ఫలాలనుండి వచ్చే
విత్తనలన్ని మొలకెత్తి మహోద్యమ వృక్షాలయ్యేవే...

విప్లవం వర్ధిల్లుతుంది 

20130427

modi

15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసి దేశ ప్రజల మన్ననలు పొందిన మోడీ కె ఒక దేశాన్ని పాలించే సమర్థత , అర్హత లేకుంటే,
 కనీసం ఒక ఊరికి సర్పంచ్ గ కూడా పనిచేయని రాహుల్ గాంధీ కి ప్రధాని అయ్యే అర్హత, సమర్థత ఎక్కడినుండి వచ్చాయో  మరి ???
ఒక రాష్ట్రాన్ని పాలించినoత సులువు కాదు ఒక దేశాన్ని పాలించడం అన్న సల్మాన్ ఖుర్షిద్(విదేశాంగ శాఖ మంత్రి ) గారి దృష్టిలో  ఒక మంత్రి గ కూడా పని చేయని రాహుల్ గాంధీ కి దేశాన్ని పాలించడం అంత సులువా మరి ???

20130402

డబ్బింగ్ సీరియల్లు

డబ్బింగ్ సీరియల్లు వద్దు, తెలుగు సీరియల్లు ముద్దు అని ఈ మద్య  తెగ మీటింగులు పెట్టి స్పీచులు ఇస్తున్నారు.
ఆ డబ్బింగ్ సీరియళ్ళ వల్ల తెలుగు బుల్లితెర నటీ నటులకు అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రజలు కూడా తెలుగు సీరియల్లె చూడాలని విన్నపిస్తున్నారు. 
దాసరి నారాయణ రావు గారు ఇలాంటి వాటికీ అండగా నిలిచి గొప్ప వీరునిలా కన్పిస్తున్నారు. అలాంటి వారందరికి న పాదాభి వందనాలు. 

వాళ్ళకి నేను కూడా నా మద్దతును తెలుపుతున్న. కొన్ని వేల మంది కి ఈ సీరియల్లె జీవనోపాధి. అలాంటి వారి పొట్ట కొట్టడం సరి కాదనేది నా భావన. వారిదొక అస్తిత్వ పోరాటం. ఒక వర్గం మరొక వర్గం పై చేసే దాడి ని ఎవరైనా ఖండిచాల్సిందే. 

సమస్య మీదగ్గరికి వచ్చే దాక మీకు అర్ధం కాలేదు. కొన్ని దశాబ్దాలు గా జరుగుతున్న తెలంగాణా పోరాటం కూడా ఒక అస్తిత పోరాటమే కదా. ఒక జాతి ప్రజలపై మరో జాతి చేస్తున్న అసాంఘిక దాడి ని సహించకనే కదా తెలంగాణా ఉద్యమం ఉవ్వేతున లేచింది. 

మరి అలాంటప్పుడు డబ్బింగ్ సీరియల్లని ఆపాలని స్టేజి ల మీద వాగుతున్న ఈ నా __ కొడుకులు రాజ్య సభ లో M.P. లుగా చలామణి అవుతూ తెలంగాణా కోసం నోరు మెదపరెందుకో ??? 


20130227

మగాడ నీకు సలాం

 మగాడ నీకు సలాం 


కామాగ్ని కి దహనం ఐన అమానత్ కి అండగా నిలబడిన ఓ మగాడ నీకు సలాం 

ఆ మగాల్లే మృగాలు గ ప్రవర్తించిన క్షణాలెన్నో డిల్లి పుర వీదుల్లో క్యాండిల్ కాంతులు వెదజల్లు తున్నై,
మగాళ్ళ మనసు లో చెక్కిన బూతు బొమ్మలకు ఎన్ని రోజులు వేయగాలవోయ్  ఈ ముసుగులు 
మూతులు నాకిన  పెదా లన్ని ఎన్ని రోజులు పలక గలవా  నినాద పదాలను ?
తెలిసీ తెలియనట్టు గా తాకినా వక్షోజాను భూతపు హస్తాలు ఎన్ని రోజులు పట్టగలవా రాతల పలకలను ?
చెట్లల్లో పుట్టల్లో నీవు జరిపిన దాష్టీకం ఎవరూ చూడలే అనేగా నీ సంబరం 
నీ రహస్యపు రస క్రీడా లో,  కాపాడాలంటూ కారిన కన్నీటి చుక్కలకు 
సజీవ సాక్షాలుగా మూగబొయి  ఊగుతున్న ఆకులెన్నో మిత్రమా 
కటిక విష దేహం తో చేదిన్చిన కటీ వలయలన్నీ మిణుగురు పురుగులై 
పగటి వేళ ఆకాశం లో వేలాడుతున్నై 
స్వప్నాల్లొనూ స్వర్గాలను చూడాలని ఎవరూ లేని నలుగు గోడల మద్యలో 
నీ అవయవమేనని కుడా చూడకుండా బలత్కరించి స్ఖలించిన 
స్ఖలనాలన్నీ మరుగు దొడ్లో మురుగు కంపు కొడుతూనే ఉన్నాయ్  రా మ్రుగాడ
 

20130224

India

దేశ పరిస్థితి ని, ఆర్దిక,  సంస్కృతిక, సాంఘిక, సాంకేతిక అభివృద్ధి, దృష్ట్యా రాజ్యాంగం లో కొన్ని మార్పులు చేస్తారు . ఇప్పుడు మన ప్రతిజ్ఞ కి కూడా మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. 
భారతదేశం నా మాతృభూమి. దేశ ద్రోహులందరూ  నా సహోదరులు.
నేను ఉగ్రవాదాన్ని  ప్రేమించుచున్నాను. కుల మత విద్వేషాలు, బహువిధమైన నా దేశ అవినీతి వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రున్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిన్నిఅవమానించే వారిని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.
నా దేశంపట్ల , దేశ ద్రోహుల,అవినీతి పరుల పట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్

20130222

MERA BHARATH

ఉగ్రవాదులను శిక్షించకుండా, వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని విచారణలు జరిపే కేంద్ర ప్రభుత్వాలు,
వచ్చే ఎన్నికల్లో ఐన గెలుపు కోసమే దాడులను  తీవ్రంగా ఖండించే ప్రతిపక్షాలు,  ఎక్స్ గ్రే షియా  లతో చేతులు దులుపుకుని ప్రజల ఓట్లను రాబట్టాలనుకునే  రాష్ట్ర ప్రభుత్వాలు
ఉన్నంత వరకి, ఈ అమాయకపు ప్రజలు దేశం లోని ఇంకెన్నో  ఉగ్రవాద దాడుల్లో  లలో ప్రాణాలు విడవాల్సిందే...

మేరా భారత్ మహాన్, జై హింద్, PROUD TO BE AN INDIAN

20130214

కృతజ్ఞత 

ఎంతో కాలం ప్రేమించుకొని, తనివి తీరా కామించుకుని,
పెద్దలకి ఎలా చెప్పాలో తెలీక నానా తంటాలు పడి,
చివరికి ప్రేమించి కామించిన వాళ్ళని వదల లేక వదిలి,
ఎవరినో పెళ్లి చేసుకునే దౌర్భా గ్యం రాకుండా,
పార్కుల్లో ప్రేమించుకునే, సందు దొరికితే కామించుకునే
మాలాంటి అభాగ్యులను మీలాంటి(VHP , బజరంగ్ దళ్) వాళ్ళు ఆదరించి
పెళ్లిళ్ళు  చేస్తున్నందుకు నా హృదయ పూర్వక అభినందనలు