20120102




ప్రతీ సంవత్సరం కృష్ణాష్టమి రాగానే నాకు గుర్తొచ్చేది  నా కృష్ణుని వేషం.


 అప్పుడు నాకు సరిగ్గా ఎనిమిది ఏన్లు, శ్రీ సరస్వతి శిశు మందిర్ నా బడి పేరు. మా క్లాసు లోకి ఒక ఆచరి (సర్ ని మా స్కూ ల్లో అలానే పిల్చేవాళ్ళం) వచ్చి మీ దాన్లో ఎవరెవరు కృష్ణాష్టమి కి వేషాలు వేస్తారో పేర్లివ్వండి అన్నారు.


ఆ మాట వినగానే నాకు ఎగిరి గంతేయాలనిపించిందనుకో, మెరుపు వేగం తో చేతి లేపి నించున్నాను ఆచారీ నేనేస్త అంటూ, సిగ్గో మరెంటో గాని మా క్లాస్ లో అబ్బాయి లలో నేన్ ఒక్కడినే  పేరిచ్చ, బాలికలు మాత్రం చాల మందే  ఇచ్చారు.




 నేను ఆ బడి లో చదివి నందుకో లేక, పోయిన సం,, ప్రభావమో కానీ నాకు కృష్ణుని వేషం వేయాలనే కోరిక బలంగా నాటుకుని పోయింది. నా కోరిక నేరవేరుతోందనే ఆనందం తో గంతులేస్తూ ఇంటికొచ్చా.




ఈ విషయాన్నంత కళ్ళకి కట్టినట్టు మా అమ్మ కి నాన్నమ్మ కి చెప్పాను,  వాళ్ళు అవును అనలేక కాదు అనలేక నాన్న వచ్చినంక అడగు అన్నారు




ఏదో పని మీద బయటకి వెళ్ళిన మా నాన్న తీరిగ్గా సాయంత్రానికి ఇంటికొచ్చాడు. ఈ విషయం అంత ఎలా చెప్పాలా అని గోడ చాటున ఉండి మా నాన్న ని చుస్థూ ఉండడాన్ని గమనించి దగ్గరికి రా అని పిలిచాడు, కొంత భయం,  కొంత అనుమానం ఇంకాస్త సిగ్గు తో అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళా.




నాన్న మొహం చూస్తూ మాటలు బయటకి రాక గుటకలు మింగుతున్నప్పుడు బాంబు పెల్చినంత వీజీ గ మా అమ్మ "వాడేదో వేషం వేస్తాడట" అని చెప్పేసింది.


టాట్ వేషం లేదు ఏం లేదు, పుస్తకాలు తెచ్చుకుని  చదువ్కో అని ఖరాకండి గ చెప్పేసాడు మా నాన్న.


నా అనుమానం నిజం ఐంది, కోపం భయం ఇంకా రేపు నా దోస్తుల ముందు జరిగే అవమానం అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చి అప్రయత్నంగానే నా  కళ్ళనుండి నీటి దార మొదలైంది.


ఉరుకుంచే ప్రయత్నాలెన్ని చేసినా పట్టువదలని విక్రమార్కుని లాగా మంకు పట్టు పట్టి, కూనిరాగాలు తీస్తూనే ఉన్నాను.


ఇక లాభం లేదని తెల్సి, నా  మీద చేసే ప్రయత్నాలు  మా నాన్న మీద చేసినా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనుకుని ఆయుధాలు అటు వైపు సందించడం మొదలేట్టారు  మా అమ్మ, నాన్నమ్మ.


నా బాధ కి అమ్మ నాన్నమ్మ ల బానాలకి మా నాన్న కరిగి సరే అనడానికి సాయంత్రం కాస్త రాత్రిగా  మారింది.


ఆ మాటకి కళ్ళలో మిగిలిన నీళ్లన్నీ జర జరా రాలిపోయి కళ్ళలో ఆనందాన్ని నింపాయి.


సరే ఇప్పుడు నా కోరిక పార్లమెంట్ లో ఆమోదం పొంది రాష్ట్రపతి తో కూడా ఒకే సారి ఆమోదం పొందాయి కానీ,


ఇప్పుడు ఎలా నన్ను కృష్ణున్ని చేయాలనే ఆలోచన లో పడ్డారు ?


కృష్ణునికి ఫస్ట్ కావాల్సింది కిరీటం, దాన్ని ఎలా చేయలని చించగా చించగా నాన్నే టీవీ కి వచ్చిన అట్ట ని తిస్కోచి కిరీటం తాయారు చేయడం లో నిమగ్నం అయ్యారు, తర్వాత దాని కి మొత్తం చెమ్కీ అంటించి ఫ్యాన్ కింద పెట్టారు, ఇంకా ఆ కిరీటానికి పెద్ద చక్రం ఎప్పుడో ఇంట్లో దాచిన పెద్ద రాఖీ కి ఉండే  గుండ్రని బంగారు రంగు కవర్ ని ఆ చక్రానికి అంటించేసారు.




కిరీటం మాత్రం చాల బాగా కుదిరింది.


ఇంకా రేపు జరిగే వేషాల గురించి ఆలోచిస్తూ నాకున్న చిన్న నులక మంచం పై పడుకుని నిద్రలోకి జారుకున్నాన్నేను.




ఎలా పడుకున్ననో ఎప్పుడు నిద్రపోయానో తెలీదు గని, అప్పుడే తెల్లవారింది.


6 వరకే స్నానం చేసి వేషానికి సిద్దంగా ఉన్న. కృష్ణుడు నీలి రంగులో ఉంటాడని మా నాన్న నా ఒళ్ళంతా నీలి రాసాడు.


అది ఊరకే పోతుందని, నీలి లో ఆయిల్ కల్పి పెట్టాలని మా  ఇంటి వెనక అక్క చేప్తే మల్లి స్నానం చేసి
నూనే తో కలపిన నీలి ని పూసారు.


ధోతి ఏం కడదామని ఆలోచిస్తుండగా మా అమ్మ మా తాతయ్య ది ఒక తెల్ల ధోతి తిస్కోచింది.


కానీ ౩ అడుగులున్న నాకు ఆ ఆరు అడుగుల ధోతి చాల పెద్దగ ఐంది, సగం మలిచిన పెద్దగానే ఉండే సరికి మా నాన్న దాన్ని చింపే ప్రయత్నం కూడా చేసి ఎందుకో విరమించుకున్నాడు.


అప్పుడే మళ్ళీ ఆ అక్కే తన దగ్గరున్న తెల్ల చున్ని తిస్కోచ్చింది, దాన్ని కట్టి చూసి బాగుందని అనుకున్నారు,


మా అమ్మ ఒక తెల్ల  చెడ్డి తెచ్చి ధోతి విప్పి చెడ్డి వేసింది లోపల అంత కనిపిస్తుందని, మళ్ళీ ధోతి కట్టారు.


అంతవరకి కనిపించని మా తమ్ముడు ఒక్కసారిగా దండ మెరుపు తో ప్రత్యక్షం అయ్యాడు.


ఒక లేత గులాబీ రంగు చున్నీ ని న నడుము చుట్టూ చుట్టి న చేతి పై వేసి అలాగే పట్టుకో అన్నారు,


తర్వత మొహం అంత మెరుపు చల్లి, దండ మేడలో వేసి కిరీట దారణ చేసారు,


ఆ కిరీటం కాస్త పెద్దగ ఉండడం తో మా నాన్న దూది పెట్టి జారకుండా పెట్టాడు.


పిల్లనగోవి కోసం అందరు వెదుకుతుండగా, మా బడి లో ఇస్తారన్నాను .


కృష్ణుడని ముందు గుర్తు పట్టేది నెమలీక చూసి, ఎంత చూసిన దొరక్క పోయే సరికి నేను కూడా అలానే సర్దుకు పోయా .


మెల్లిగా నడుచుకుంటూ ఇంటి బయట అడుగు పెట్టగానే గోపికలంతా పరిగెడుతున్నారు, నన్ను చూసి మాత్రం కాదు


ప్రోగ్రాం కి టైం అవుతుందని...


ఓ పక్క నాన్న ఇంకోపక్క మా తమ్ముడు చుట్టూ మా దోస్తులు అంత కలిసి మా బడికి చేరాం.


అక్కడ మా ఆచరి నాకు ఒక పిల్లన గోవి ఇచ్చాడు.


ఇక గోపికలు రాధలు కృష్ణులు అందరిని ఒక దగ్గర కూర్చోపెట్టి, పేర్లు పిలుస్తున్నారు. అలా పిలచిన ప్రతి ఒక్కరు
డయాస్ పై నడిచి రావాలన్న మాట, అంటే చిన్న ఫాషన్ షో టైపు అన్న మాట.


మెల్లిగా నావంతు వచ్చింది. నేను అడుగులో అడుగు వెస్తూ కిందికి చూసుకుంటూ నడుస్తున్న్నా, పక్కనుండి ఎవరో పెద్దాయన కృష్ణుడు అలిగి నట్టు ఉన్నాడు, అంటే మా ఆచరి (మేడం) కాదు కృష్ణుడు సిగ్గుపడుతున్నాడు అంది.


తర్వాత బహుమతుల ప్రధానం అని చెప్పారు...


మొదటి బహమతి నాగ మల్లేష్ 3 వ తరగతి అనగానే పరిగేత్తుకుంటూ వెళ్ళాడు,


ఎందుకు పరిగెతుతున్నాడో నాకు అర్ధం కాకా ముందే...


రెండో బహుమతి రాంప్రసాద్ అని...


అందరు పరిగేత్తు  అంటే నేను పరిగేత్తి ఒకతని దగ్గరికి వెళ్తే, అందరు వెనక నుండి నవ్వుతున్నారు, అప్పుడు  అతను "అక్కడికి వెళ్ళు, వాళ్ళు నీకు బహుమతి ఇస్తారు " అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను.


తర్వాత మా నాన్న నన్ను పిలిచి క్రిష్ణుని  లా  పోజ్ పెట్టమంటే పెట్టమని ఫోటో తీసారు.


నాకిచ్చిన బహుమతి ఏంటో తెలుసా, ఒక స్టీల్  గ్లాస్, ఇప్పటికి నేను అందులోనే అప్పాలు వేస్కుని చాయ తాగుతాను...


I am not  a complan boy, I am a complicated boy...