20111230

ద్వేషిస్తున్నా నేనిప్పుడే ... 
నీ  మనస్సు  తో  నిండిన  నా  హృదయం 
                ఆ మనస్సు నీటి మూట అని తెలిసి, 
                            రోదిస్తున్న నా హృదయాన్ని పిండే స్తున్నా నేనిప్పుడే...


ప్రేమిస్తున్నానేనిన్నన్న పలుకు ప్రాణవాయువై 
                రక్తం లో పరిగెడుతుంటే, 
                             అది మలినమని కడిగేస్తున్నాయంతరవయవాలిప్పుడే .


తనువును తన్వింప చేసే స్పర్శ కు 
                స్పృహ లేదని తెలిసి,
                             బిగబట్టి చూస్తున్నై నా దేహ రోమాలిప్పుడే...


నే కావాలన్న నీ మాట విన్న నా చెవులు 
                ఆ మాట తన మనస్సు ది కాదని, 
                            కలిపెస్తున్నై ఆ మాట ని గాలిలో నా చేవులిప్పుడే...


స్వర్ణం తో జత చేసిన చుంబనానికి 
                చందనం లాంటి పరిమలం లేదని తెలిసి, 
                            విస్తు పోతున్నై నా చేతు లిప్పుడే ...


రుద్ర ప్రవాహం గల నది పేరున్న 
               నీ మది దిశ మారుస్తుందని తెలీక,
                             దారిలో ఇసుక రావ్వనై రవి జ్వాల కు 
                                                      రగిలి పోతున్నానేనిప్పుడే ...

20111229నీ  చూపులు  నా కను  పాపని  గుచ్చుతున్నా ...

నీ  వెచ్చని  శ్వాస  నా  నాసిక  కుహరాలను  తాకుతున్నా ...

నీ  పెదాల తడి నా  పెదాలను తడుపుతున్నా  ...

అలుపెరుగని  యోదుడనై  గుండెల్లో  చెక్కిన  శిల్పాన్ని

మనసుతో  చూస్తూ   కాగితం  పై  చిత్రించా ...

నీ  సౌందర్యానికి  ఒక  చిన్న  చిత్రకారునిగా  నే  చేసిన  ప్రయత్నం  లో

విఫలమే  అయ్యాను ...  

                 లేకపోతే   నీ  రూపాన్ని  కాగితం  పై  బందిన్చాలనుకోడం

అవివేకమే  కదా ...

ఒకవేళ  స్వర్ణ కారుడనే  అయితే  నీ  రూపాన్ని  బంగారం  తో  చేసి ...

తనివి  తీర  స్పృశించి   మరుక్షణమే  మరణించి
నీకు  ప్రాణం  పొసేవాడినేమో....
ఇది  కవిత  కాదు, కవితలు  నీకు  నచ్చవనీ   తెలసు....


ఇది  నా  చూపులు  చెక్కిన  అక్షరాలకు 
                                           మౌనం  మాట్లాడే  బాష ....

20111126

ఆకాశం తెల్లని చుక్కల నల్లని చీర చుట్టుకుని 
             మేని మోము పౌర్ణమి వెన్నెల చిరునవ్వు విసురుతోంది,
                             మరి నేను తన అందానికి తట్టుకోగలనా... ?
జాబిలి తన కురులతో సూర్యుని వెలుగుని కప్పేసి 
              ఏమి ఎరగనట్టు మొహాన్ని తిప్పేసి అమవాస్యని చూస్తోంది...
రేపటి పగలు వెలుగు కోసం 
            ఈ రాత్రి వెన్నెల మిణుగురు పురుగుల  వేట లో పడింది.
సాయంత్రానికి తేనె తీగలన్ని ఆకాశాన్ని చేరాయి తేనె కోసం,
             పాపం ఆకాశం తెల్లని చుక్కలతో ఎలా కంది పాయిందో చూసావా ?
ప్రియుడి కోసం నిరీక్షించి 
          వెన్నెల విదిల్చిన కన్నీటి చుక్కలతో 
                                నిండి పోయింది ఆకాశం.
సూర్యుని పగటి రాసా క్రీడ కు 
            ఒక తార జువ్వ పెదవి కంది పోయి 
                          వెన్నెల వెలుగును పంచుతుంది.
                                     రేపు ఏ తార పెదవో  !
                                     సూర్యు డెంత రసికు డైతే మాత్రం 
                                     రోజుకో తార నా... ?
పగలంతా సుఖ పెట్టిన సూర్యుని హృదయం పై
            చంద్రిక సేద తీరుతుంది సాయంత్రం వేలకి,
                            పగలంతా రతి, రాత్రంతా  ఉపరతి... !
పగలు దాహం తీర్చడానికి 
          రాత్రి తన రొమ్ము పాలతో నింపుతుంది  ఆకాశాన్ని.
ప్రేమకి ఒక కామ,
ప్రేముంది... ప్రేమించే ప్రేమలో ప్రేముంది.
కానీ కోరుకునే ప్రేమలో కామముంది.
కామమే ముందుంది. ఈ కామ క్రీడలో 
మరింత రసాన్ని ఆస్వాదించ డానికి
ప్రేమ అనే మీట ను నొక్కి ఆ కామానికి 
ప్రేమని జత చేసి, కేవలం ప్రేమతోనే 
కామించామని భ్రమ పడేలా చేసి 
ఆ కామ(,) కి పులిస్టాప్ పెట్టి 
ప్రేమ ముగుస్తుంది తీరిన దాహం తో... 
ఆగితే నేనెక్కడ ఓడిపోతానో అన్నట్టుగా 
                   దోచుకు పోతున్నారు ఆణువణువూ 
                                అంగడి సరుకైనట్టుగా న తెలంగాణా ను...
జీవితపు ముగ్గు 
మనుషులు, మనుషుల మనుసులు,
మనసులను మాపిన మత కులాల మబ్బులు,
మబ్బుల సందుల సుక్కలు ,
సుక్కలు ఇదిసిన సినుకులు, 
సినుకుల మద్యన సిక్కిన, 
సిక్కుల బానిస బతుకులు, 
బతుకుల గతుకుల ఆకిలి మీద 
సల్లిన కన్నీటి సందు సుక్కలు... 
ఆ సుక్కల్ కలుపుతూ సిక్కటి సీకటి లో 
ఓ సక్కని సుక్క వేసిన సంబరాల సంకురాతిరి ముగ్గు ...
మారిన మనసు  
౬౦ ఏళ్ల నరక యాతనకు 
మౌనమే మనసు మార్చుకుంది.
శాంతి యాత్ర నే దారి మార్చమని 
ఆయుద తోవ చూపింది.
ఎత్తిన పిడికిల్లో కత్తులు పెట్టి 
అహింస నే రక్తం రుచి చూపమంది.
ఎగిరే జెండాలే, జెండాలకు 
సక్యత లేని సమైక్య మొండాలను 
ఉరితీయమంటున్నది....
రణక్షేత్రం 
ఐదుగురు మోగుల్లుండి సాయం అడిగిన 
ద్రౌపది లేక్కున్నది న తెలంగాణా...
కృష్ణుడు రాకపోతడా అని చూస్తున్నది.
సమైక్యతని చీల్చి ఆ రక్తం తో తెలంగాణా 
శిఖ ముడుస్తానని ప్రతిజ్ఞ చేసింది...


కురుక్షేత్రం మొదలైంది,
జమ్మి చీట్టు మీద పదునెక్కిన ఆయుదాలు
ఈ దసరా కే చేతి కి అందినై.
పాలపిట్ట సైగ చేసింది 
రానక్షేత్రానికి సిద్దం కమ్మని 
ఇగ కౌరాన్ద్రుల రక్తం తో తెలంగాణా సిగ ముడుసుడే 
సమైక్యం పేగులు తెంపి,
తెలంగాణా మెడల వేసి 
అశ్వ మేధ యాగం చేసుడే... 
 తీరని దాహం 
నా తోట లో ఒక జీవితం గొంగళి పురుగు గానే మిగిలో పోతున్నది,
బస్మంత ని ఎగరాలనే కోరిక లెక్కనే ఉంటున్నది.
బతుకులు మొగ్గలై రాలిపోతున్నవి.
పువ్వులై పూసే ఆశే లేకుండా పోతున్నది.
గుండె లోతుకు వేసిన బోరు మట్టిని కూడా తడప లేదు.
దాహం తో వేరు గుటక లేస్తున్నది...


నల్లని బొగ్గు పెళ్లలు మండే మంట లవడం ఎంత సేపు...!
నిరసనలు మాని నిప్పులవడం ఎంత సేపు...! 
సాయుధ పోరాట చరిత్ర కల్గిన మేము ,
శాంతి ని వదలడం ఎంత సేపు...!
ప్రతీ ఆత్మహత్య ముందు,
ఒక హత్య ను చేర్చడం ఎంతసేపు...! 
ఎంత సేపు ఎంత సేపు     హా...


కాలయాపన తో కడుపు రగిలి పోతున్నది.
పీల్చిన గాలి పొగలు గక్కుతూ బైటకోస్తున్నది.
గుండె బండై గుద్దుతున్నది.
ఆగని అవాశం అరచేతికి చెమట పట్టిస్తున్నది.
పదునెక్కిన ఆయుధం ఎదురు చూస్తున్నది.
ఆ చేతికి అందాలని,రాష్ట్ర సాదన కు
 శాంతి కాదు సాయుదమే మేలంటున్నది.
అన్న వై, ప్రజల గన్ను వై రాష్ట్రాన్ని సాదించమంటున్నది.
గొంగళి పరుగు బస్మంత నయ్యే కోరిక తిర్చమంటున్నది.
పువ్వుల పరిమలిస్తామని మొగ్గలు మొత్తుకుంటున్నై.
సమైక్యం మెడలు నరికి రక్తం తో మట్టిని తడిపి,
వేరు తన దాహం తీర్చమంటున్నది...
వదలరా ఇకనైన  
ఏమున్నది ఏమున్నది, మాదగ్గర ఏమున్నది, 
వద్దన్నా వినక గుండె మీద తుపాకి గుండు బెట్టి,
సంస్కారం అని సాకు జూపి సొత్తిరి మా ఇంట 
యాబది ఎండ్లైన విడవక... 


ఏమున్నది ఏమున్నది మా దగ్గర ఏమున్నది 
ఇచిన్న పాలు సాలక, పొదుగు చేత కొల్ల గొట్టి,
జలగ వలె బట్టి, పీల్చి పీల్చి పిప్పి జేస్తివే,
బాదుల బంధాలు కల్పి, నగర్ ల నాయకత్వం జూపి,
సంది బండల దూరి, సర్కారీ కొలువుల జేరి,
ఎతైన పీటభూమి ఎక్కి ఎతైనోడివైతివే...


ఏమున్నది ఏమున్నది మాకేమున్నది, 
గని బతుకులు సాలక గల్ఫ్ దేశమేగి,
ఖైదీ లై  కనుమరుగవుతుంటే...
ఉన్న జాగ పోరుగోడికిచ్చి, పద పద మని 
పరుగున పొరుగు దేసం బొయినొల్లను 
కన్నీటితో కాటికి పంపే సిక్కిన సీకట్ల బతుకులు 
సాలింక మాకిక సాలు ...


ఏమున్నది ఏమున్నది
ఆనాటినుండీనాటివరకేమున్నది ?
నిజాం  నోట నోళ్ళు మూసి, సర్కారు కాలం ల కళ్ళు మూసి
మూసి మూసి, మూసి మురుగు  లోన మాసి పోయిన
బానిస బతుకులు సాలింక మాకిక సాలు 


వదలరా ఇకనైనా నా తల్లిని, నా తెలంగాణా తల్లిని...   
పీపుల్స్ వార్ 
ప్రజల యుద్ధం అని పేరు, ప్రభుత్వాలను కూల్చే ,
కన్నా ప్రేమను దూరం చేసి, కసాయి రక్తపు మాడుగుల జూపె,
రంగు గుడ్డ లేక, లగ్న పత్రిక లేక 
ఖాకి గుడ్డ కట్టి, ఆయుధం చేత పట్టి,
ఎందుకట ఈ అడువుల బతుకులు, ఎక్కడికత ఈ ఉరుకులు పరుగులు
కాదా పంచభుతివి నీవు, లేదా అనుభవించు హక్కు నీకు,
పలికే కామ్రేడ్ ని పెదవి  వదిలి 
గర్జించలేవా ఒక్క ప్రశ్న ప్రజాస్వామ్య వేదిక పై...

20111124

prema

ప్రేమ
ద్వి సహస్ర నవ సంవత్సరమున...
ప్రేమించే ప్రేమకు ప్రేమ దూరం అవడం చూసి,
ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమ తో ప్రేమించడం నేర్చుకున్నాక,
ప్రేమ, ప్రేమను ప్రేమించే ప్రేమ ది ప్రేమ కాదని,
ప్రేమ ప్రేమించే ప్రేమ కోసం ప్రాణంగా ప్రేమించే ప్రేమని ద్వేషించటం చూసి,
ప్రాణంగా ప్రేమించే ప్రేమని ప్రేమతో ద్వేషించి,
ప్రేమ ద్వేషాన్ని ద్వేషం తో చూస్తూ ప్రేమ ద్వేషాన్ని ద్వేషంగా మార్చుకున్నాక...


ప్రేమించే ప్రేమ ప్రేమ దే  ఐనప్పటికీ ప్రేమించ బడ్డ ప్రేమ ది ప్రేమించే ప్రేమ కాదని,ఈనాటి ప్రేమలో ఏ ప్రేమ ప్రేమని ప్రేమించదని
ప్రేమని ప్రేమతోనే చూడాలని , ప్రేమతో ఏ ప్రేమని  ప్రేమించకూడదని,
నేర్చుకున్నా  అసలెలా ప్రేమించాలో ....

i want to share some stories n poetry of mine

పేదోల్లారా వెళ్ళిపొండి 
               నల్ల కుభేరులకే ఈ నవ భారతం. 
తెల్లన్నానికి చోటు లేదు, నల్ల ధన కజానాలకే చోటిక్కడ.
బుక్కెడు బువ్వ కు గతి లేదు, దోచే సిరులకే జాగిక్కడ.
దినం కూలి కి పని లేదు, మేసే కంట్రాక్టర్ లకే పనులిక్కడ.
నాగాల్లకు పదును లేదు, ఆసాముల చూపులకే భూములు.
గడ్డి గుడిసెలకు సందు లేదు, అద్దాల మేడలయితే కట్టనిస్తం.
కింద కూసునేటోల్లద్దు , కనకపు సింహాసనాలయితే చేయించుకోండి.
ఇస్తరాకులు కుదురవు, వెండి పల్లాలుంటే పట్టండి.
మట్టి గాజులు ముట్టద్దు,ప్లాటినం గోట్లు వేస్కోండి.
ఆదార్ కార్డులు వద్దు వద్దు, స్విస్ బ్యాంకు లో కాతాలు తెరవండి.
గల్ల పెట్టె చిల్లర చూపొద్దు,రంగు  నోట్ల గాంధీ నవ్వు దాచు.
నీతి గల నోటి మాటలోద్దు, అవినీతి నోట్ల కట్టలుంచు.
ఆరడుగుల నేల లేదు, కబ్జా సురులకైతే అపరిమితం.
పెదోల్లార దయచేసి వెళ్ళిపొండి
                      నల్ల కుభేరులకే ఈ నవ భారతం.
                                   

  

20111123

This is our mother india, you can find poluted air coming from the factories, saree of the nature is brning...
the nature streached her hands and asking to save her...
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa