నానీలు
కుక్కలు నక్కలు
ఒకటే ఊళలు
రాక్షసుడు
మళ్ళీ రాజ్యం లోకి
ఉరిమిన మబ్బుల్లో
నీరింకింది
డిసెంబెర్ ప్రకటన తో
తెలంగాణా
రక్షించు అక్షముల
బక్షించు పక్షములు
న్యాయమూర్తి కే
గాలం
ఎర్రలకు చాపలు
మద్యానికి మనుషులు
ఈనాటికివే
ఎన్నికలు
ఆది కవులాంద్రోల్లు
వానికి తాతలు
మన
పోతన్న సోమన్న లు
రవి గాంచని చోట
కవి గాంచే
కాళన్న
కనిపించకపాయె
రాజ శేఖరుని
మరో ప్రస్థానం
సి. బి . ఐ .
జైల్లో జగన్నాటకం .
గ్రహనాంద్రుడు
సూర్యున్ని మింగిండు
వెలిగే కాలానికి
కోటి లింగాల.
చీకటి బతుకుల
మిణుగురు పురుగు
సింగరేణి
కార్మికుడు
మరణ శయ్య పై
మందమర్రి
ఉదయించేందుకు సిద్ధంగా
ఓపెన్ కాస్ట్
గుట్టలు భూమికి
భూమి పాతాళానికి
గ్రానైట్లు
ఓపెన్ కాస్ట్ లు
నిండా గోదారి
నోరు తడవని ఎడారి
ఆదిలాబాదు
కరీంనగర్
ప్రపంచం ఎరుగని
ప్రఖ్యాత వరదే కామరూపిని
బాసర
సరస్వతి
ఆదిలాబాద్ అడవుల్లో
ఎదిరించిన
ఎర్ర మందారం
కొమురం భీమ్
చేన్లో రాలిన
విప్లవ విత్తనాలు
తెలంగాణా
అమరులు
పాతాళ భానిసలు
భళి చక్రవర్తి
వారసులు
భూగర్బ కర్షకులు
తల పై గంగ
గొంతు నిండా విషం
నీలకంటుడు కాదు కాదు
నల్గొండా ...
ఉదయించేసూర్యుని తో
ఎరుపెక్కిన
అడవి పువ్వులు
మా అన్నలు
భూమి బద్దలై
అరుణ లావా
ప్రవహించింది
జగిత్యాలకు ...
చెట్లన్నీ త్యాగం చేసి
చదువుకు ప్రాణం పోసి
కాగజ్ నగర్
అయ్యింది
క్రూర సాధు జంతు పక్షులన్నీ
కలిసే ఆడుకుంటై
నిర్మల్
కొయ్య బొమ్మలై
బయ్యారం బావో
లోటస్ పాండో
c/o ఇడుపుల పాయ
ఆరడుగులకే
ఎన్ని వేశాలేసిందో
వేదవ దేహం
విధి లేక
విగత దేహమైంది.
చేగువేరా
వారసత్వం
దండై కదిలింది
మిలియన్ మార్చ్ కు
కవి కన్నీరు రాలి
కవిత్వమై మొలిచింది
క్రాంతి నీడగా
నిలిచింది.
నింగి లో చుక్కలన్నీ
రాలి పడ్డై
బతుకమ్మల మీద
దీపాలయ్యేందుకు.
పల్లెలన్ని
చీకట్లో మునిగాయా ?
వారి మనసులు చూడు
వెలుగు తున్నై .
సూర్యులంతా
ఇంటికి చేరారు
సాయంత్రానికి
నేటి పొలం పనులు చేసి.
గిరిజన
దిగుట్లో దీపం
సూర్యోదయానికి
మరో రూపం
ఆటవికులు
అభివృద్ధి కి దూరం కాదు
సంప్రదాయానికి
వెలుగులు.
ఉద్యమ వనిత కు
వందనం
వాడిన కత్తులు
నూరినందుకు
అవి పెద్ద పులి
అడుగులనుకున్నావా ?
కొమురం భీం
జాడలు
ఇంద్రవెల్లి లో రక్తం
ఇంకా ఏరులై
పారుతుంది
దళాలను నింపేందుకు
నిశీది కాలపు బాటసారి
కనిపించాలేదా
ఆదిలాబాద్
అందాలూ ?
పులులు సంచరిస్తున్నై
కవ్వాల్ అరణ్యాల్లో కాదు
వికృత
సమాజం లో.