20130924

రాక్షసుడొస్తున్నాడు

రాక్షసుడొస్తున్నాడు

ఎడతెరిపి లేకుండా  రాష్ట్రం అంత ఒకటే తుమ్ములు,
ఈ చవితికి చందమామ లే కనిపిస్తున్నై
కుక్కలు నక్కలు నడి వీధి లోకి వచ్చి
ఓల పెడుతున్నాయి .

వస్తున్నాడోస్తున్నాడు
రాక్షసుడు మల్లి రాజ్యం లోకి.

రైతులు వేసిన విత్తనాలు నాటు కోక ముందే
చేను లో నాట్యమాడెందుకు,
ఏడేండ్లు తిని , ఏడాదిన్నర ఏకాకి అయి
ఇప్పుడు ఏడిపించేందుకు ,
డబ్బాశ చూపి చాపాలను పట్టేందుకు
తేర చాపలు తెరచి సొర చాపలా వస్తున్నాడు .

కళ్ళెం తెగి మదమెక్కి రధం ఇడిసిన
గుర్రమోలె సకిలిస్తూ...
ఆకలి తో ఉన్న సింహం బోను నుండి
తప్పింపు తెప్పించుకుని ,
శవాలను పీక్కు తినే పీతిరి గద్దోలె
ఊర్ల మీద పడి ఊపిర్లాపేందుకు వస్తున్నాడు.

వరాహ మెత్తిన జగతి ని
మరలా వనికిచ్చేందుకు,
 శెండాలుని కడుపున శెడబుట్టి
శకుని బుద్ది తో రాజ్యమేలేందుకు వస్తున్నాడు .

పదిలెం పదిలెం,
అమాయకపు ప్రజలారా జెర పదిలం,
ఏమాత్రం ఏమరపాటుగున్న 
ఏర్పడకుండా రక్తం పీల్సేత్తడు.

జై తెలంగాణా జై జై తెలంగాణా  


No comments:

Post a Comment