20130928

cinema

ఒక పుస్తకాన్ని అయిదు వందలు పెట్టి కొని చదవలేని ఒక విద్యార్ధి , పేదోడు పాపం అదే పుస్తకం ఫోటో కాపీ ని వంద రూపాయలకు తీస్కుని చదివి పరీక్ష లలో పాస్ అయ్యాడు ...
ఇప్పుడు ఆ విద్యార్ధి చేసింది తప్పా ? ఒప్పా ?
తప్పు అయితే, శిక్ష ఎవరికీ విదించాలి ? ఆ విద్యార్ధి కా ? లేక ఆ పుస్తక విలువని అయిదు వందలు గ నిర్ణయించిన పబ్లిషర్ కా ?

అలాగే
రెండు వందలు పెట్టి దియేటర్ లో సినిమా చూసే స్తోమత లేని ఒక వ్యక్తి , నలబై రూపాయలు పెట్టి ఒక సి.డి. కొనుక్కుని వచ్చి ఒక కొత్త సినిమా ని తన కుటుంబానికి చూపించి ఆనంద పడ్డాడు .
ఇందులో తప్పేముంది ?
లక్షలు సంపాదించే వాళ్ళు ఎలాగు ఆ పైరసీ సి.డి. లు చూడరు, ఆ చూసేది ఈ సమాజం లో ఎనభై శాతం గా ఉన్న పేద మద్య తరగతి ప్రజలే.

అయితే ఇక్కడొక ప్రశ్న .
లక్షలు లక్షలు సంపాదిస్తూ ఏ.సీ. ల్లో తిరిగే వాళ్ళ కోసమే సినిమా తీస్తున్నారా ?
లేక ప్రతీ పేదవాడిని సంతోష పరచాలనే సదుద్దేశం తో తీస్తున్నారా ???
సినిమా టికెట్ల రెట్లని అమాంతం పెంచేసి పేదవాడికి సినిమాని దూరం చేయడం మొదటి సమస్య అయితే .

రెండవ సమస్య.
బ్లాక్
బ్లాకు లో టికెట్లు విక్రయించడం. ఇదంతా దియేటర్ యజమాని కనుసన్నల్లో జరగడం సిగ్గు చేటు . అందులో ధనార్జనే ద్యేయంగా సినిమాని ఎక్కువ ప్రింట్లతో రిలీజ్ చేసి తక్కువ సమయం లో కోట్లు సంపాదించాలనుకోవడం బ్లాక్ దందా కు వెన్నెముక లా పని చేస్తుంది. వారం తిరక్కుండానే సినిమా ను మార్చేయడం, నడిచే ఆ వారం పది రోజుల్లోనే సినిమా చూసే అవకాశం తక్కువ గా ఉండడం తో బ్లాక్ ఇంకా విజ్రుమ్బిస్తుంది .
అంత ఖర్చు పెట్టి సినిమా చూడడం పేద, మద్య తరగతి వాళ్ళ కి అసంభవం.

సినిమాల్లో నాటకాలు వేసి తమ పని తాము చేస్కోకుండా , చేతి నిండా డబ్బు , సమాజం లో కొంత పేరు రాగానే మదమెక్కి రాజకీయాలు చేస్తూ మీకు మీరే శత్రువు లుగా మారుతున్నారు . ఆ శత్రుత్వమే మీ పైరసీ కి ఉతం ఇస్తుంది. అదే భావన మిమ్మల్ని ఫాల్లో అవుతున్న, మీ అభిమానులు కూడా” పైరసీ వచ్చింది నా హీరో ది కాదు కదా “ అనే కాకుండా “ వాడు నా హీరో కి శత్రువు, అయితే నాకూ శత్రువే” అని పైరసీ సి.డి. లను పంచి పెట్టె పరిస్థితి కి తీస్కు వచ్చింది.

ఒకరికి అవార్డు ఇస్తే ఇంకొకరికి కోపం , ఒకరి సినిమా ప్లాప్ అయితే ఇంకొక హీరో కి పట్టలేని ఆనంద పడడం మీ వంతు.
అంతే కాక అన్ని దియేటర్లను ఆ నలుగురి చేతుల్లో గుత్తాదిపత్యం పెట్టుకుని ఎదుగుతున్న చిన్న సినిమాలని తోక్కేయడం వాస్తవం కాదా ??
పెద్ద పెద్ద హీరో లుగా చలామణి అవుతూ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కాని, కనీసం ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా ?

ఒక ప్రముఖ హీరో ఈ పైరసీ కి అడ్డు కట్ట వేయాలనే ఒక మంచి ఆలోచనతో DTH లో సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తే, ఎన్ని ఎత్తులు వేసి తనని కించపరిచి, తన ప్రయత్నాన్ని విరమించుకునేల చేసింది మీరు కాదా ???

అయినా వంద కోట్లు, వెయ్యి కోట్లు పెట్టి ఎవరు మిమ్మల్ని సినిమాలు తియ్యమంటున్నారు ? మీ వీరాభిమానులు కూడా మీ నుండి కోరుకునేది ఒక మంచి సినిమానే గాని కోటి కోట్ల బడ్జెట్ సినిమాలు కాదు...
వీధి నాటకాలే సాంకేతిక మార్పు వల్ల దియేటర్ల లో ఆడుతున్నాయన్న విషయాన్నీ మర్చిపోవద్దు .

ఇదంతా చెప్పేది ఒక మద్య తరగతి యువకుడు. 

No comments:

Post a Comment