20130909

నేను పెట్టిన గులాబీ మొక్క

నేను మీ అందరికి ఒక కథ చెప్తాను ...
కథ కి పేరు ఉండాలి కదా ...

 హా నేను చెప్పే కథ పేరు "నేను పెట్టిన గులాబీ మొక్క "


ధ్యానం ... ధ్యానం వలన ఏకాగ్రత ...
               ఏకాగ్రత అంటే చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం . చేస్తున్న పని మీద కాకుండా మరి మనం ఇంకెక్కడ దృష్టి పెడుతున్నాం ?
ఆలోచనలపై , మెదడు కంటున్న కలలపైన ...

            ఏంటి "నేను పెట్టిన గులాబీ మొక్క " అని చెప్పి మెదడు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ??

సరే ...
         
              అది వర్షాకాలం . కాలేజీ లో అందమైన గులాబీ మొక్కకున్న పువ్వుని చూసి నాకు చాలా ముచ్చటేసింది . అమ రూం ముందున్న ఖాళి స్థలం లో ఈ మొక్క ని పెడితే బాగుండు అనిపించింది . ఆలోచనే తడవుగా ఒక కొమ్మని తిస్కోచ్చాను . అప్పటికే ఆ ఖాలీ స్థల;అం అంత పిచ్చి మొక్కలతో నిండి పోయింది . అందులో నేను ఒక మంచి స్థలం చూసి మొక్కని  నాటాను . వర్ష కాలం కదా నీళ్ళు పట్టాల్సిన అవసరం కూడా లేదు .

        తెల్లారి లేవడం ఆ మొక్కని చూడడమే చిగురించిందేమో అని , లేదు రెండో రోజు కూడా మూడో  రోజు కి ఆ మొక్క ఇంకా పచ్చి గానే ఉంది . దాని చుట్టూ ఉన్న పిచ్చి చెట్లు చాలా ఎత్తు పెరిగాయి .

         మాకు రూం ఇచ్చిన ముసలమ్మా ఒకసారి రూం చూద్దామని వచ్చింది . రూం ని శుబ్రంగా కడిగేసింది . చెత్తంతా ఎత్తింది . గుహలా ఉన్న మా రూం ని ఇల్లుల మార్చింది . మద్యాహ్నం కాలేజీ కి వెల్లొచ్చెసరికి రూం ముందున్న పిచ్చి చెట్లన్నింటిని పీకేసింది ... పీకేస్తుంటే ఓ మొక్క ముళ్ళు కుచ్చిందట ... అది నా గులాబీ మొక్కనే ... మిగిలిన మొక్కలని పీకేస్తూ వాటి వేర్లకున్న మట్టిని దులిపి ఆ పిచ్చి మొక్కలని బయట పడేస్తుంది .

నేను పెట్టిన గులాబీ మొక్క చిగురించలేదు మరణించలేదు కాని ... పిచ్చి మొక్కల్లనే ...

            మొదట్లో నేను చెప్పిన మెదడుకి ఈ పిచ్చి మొక్కలకి సంబంధం ఉంది . మన మెదడు కూడా భూమి లాంటిదే . ఆ మెదడు పైన పిచ్చి ఆలోచనలు కూడా చాల మొలుస్తాయి . వాటి వాళ్ళ అంత గ ప్రయోజనం కూడా ఏమి ఉండదు , సారాన్ని తినడం తప్ప . మనం చేయాల్సిన పని కూడా గులాబీ మొక్క లాంటిదే . ఆ మొక్క కంటే ముందు ఆ పిచ్చి ఆలోచనలే వేగంగా విస్తరిస్తాయి . అందుకే నేను ఎంతో ప్రేమతో పెట్టిన నా గులాబీ మొక్క కి విలువ లేకుండా పోయింది పిచ్చి మొక్కల్లాగే ...

           మల్లి ముసలమ్మా రావాలి నా మెదట్లో ఆలోచానలన్ని పీకి , వేర్లకున్న మట్టిని దులిపి బైట పడేయాలి . గుహల ఉన్న నా మనసుని గుడిలా మార్చాలి ...

       అప్పుడే నా పనికి నా మొక్క కి విలువోస్తుంది . చిగురిస్తుంది .
అందమైన , సువాసనలు విరజిమ్మే మొగ్గ తొడుగుతుంది . పువ్వు గా మారి పరిమలిస్తుంది. 

నేను కీర్తి శేషుడనుఈ జీవితం చివరి రణ  రంగం లో
 నా పాపాలన్నింటిని చన్నీళ్ళతో కడిగేసారు .
పతవాన్ని బాగుండగానే
 కొత్త బట్టలు తొడిగించారు.

మరణం అనే రధాన్ని
ఎనిమిది కాళ్ళతో
నలుగురు స్వారీ చేస్తున్నారు .
నాపై తెల్లని గుడ్డ కప్పి
మరక లేని మనిషిని చేసారు .

ఏడిచే వాళ్ళు కొందరు ,
ఏడుపు రప్పించే వాళ్ళు ఇంకొందరు .
నన్ను ఇన్నాళ్ళు ఏడిపించిన వాళ్ళు
నాకోసం ఏడుస్తూ
నాకు నవ్వు తెప్పించేలా చేస్తున్నారు .

నేను రానని రాలేనని తెలిసి
నా బందు మిత్రులందరూ నా పేరు ను
పిలిస్తున్నారు.
తలుస్తున్నారు ...

నాకు నిద్ర పట్టదని తెలిసి
కట్టెలపై నే పడుకో బెడుతున్నారు .
నాకు నిప్పంటే భయమని తెలిసీ ,
 నిప్పంటిచ్చేస్తున్నారు .
ఒంటరి తనాన్ని భరించ లేనని తెలిసీ,
 ఒంటరి గా వదిలేసి వెళ్తున్నారు .

నా నిండు దేహాన్ని
నిర్దాక్షిన్యంగా కాల్చేసి,
బొమ్మకి బొట్టు పెట్టి,
గోడకి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

నా పునః నామకరణ
మరణ మహోత్సవానికి
పత్రికలచ్చు వేయించి,
అందరిని ఆహ్వానిస్తున్నారు...

               ఇప్పుడు నేను కీర్తి శేషుడను ...

అయోమయం

అయోమయం 

 నేనొక ఆత్మ ని ... 

పాత  బంధాలను మరచి కొత్త బంధాల లోకి నెట్టి  వేయబడుతున్నాను .
దవాఖానా జాతరలా నిండిపోయింది ...
నాకు అయిన వాళ్ళు , నాకు కాబోయే వాళ్ళు నన్ను చూడడానికే వస్తున్నారు ...
కాబోయే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు మెదులుతుంది. 
నా వాళ్ళంతా బోరున విలపిస్తున్నారు ...
ICU లో డాక్టర్లంత నాకు ప్రాణం పోసే పనిలో పడ్డారు .
మరి కొందరు ప్రాణం నిలిపే పనిలో పడ్డారు .
నేను మాత్రం చీకటి వెలుగులను చీల్చుకుంటూ బయట పడాలనే చూస్తున్నా ...

చీకటి గూటికి చేరుతుంది ...
మసక బారిన ఆశలన్నీ మదిలో చేరబోతున్నాయి .
మదిలో మెదిలిన ఆశలన్నీ మసక బారుతున్నై .
ఆలోచనలన్నీ ఉవ్వెత్తున ఎగరబోతున్నై .
ఉవ్వెత్తున ఎగిరే ఆలోచనలన్నీ తీరాన్ని తకుతున్నై
ఊపిరి వేగం తగ్గుతుంది ...
వేగంగా వీచే గాలి ఊపిరిగా మారబోతుంది
గల గల మాట్లాడే గొంతు మూగ బోయి ,
దేహ దహన నూతన దేహానందం తో కేరు మంది నా ఆత్మ ...