20130909

నేను కీర్తి శేషుడను



ఈ జీవితం చివరి రణ  రంగం లో
 నా పాపాలన్నింటిని చన్నీళ్ళతో కడిగేసారు .
పతవాన్ని బాగుండగానే
 కొత్త బట్టలు తొడిగించారు.

మరణం అనే రధాన్ని
ఎనిమిది కాళ్ళతో
నలుగురు స్వారీ చేస్తున్నారు .
నాపై తెల్లని గుడ్డ కప్పి
మరక లేని మనిషిని చేసారు .

ఏడిచే వాళ్ళు కొందరు ,
ఏడుపు రప్పించే వాళ్ళు ఇంకొందరు .
నన్ను ఇన్నాళ్ళు ఏడిపించిన వాళ్ళు
నాకోసం ఏడుస్తూ
నాకు నవ్వు తెప్పించేలా చేస్తున్నారు .

నేను రానని రాలేనని తెలిసి
నా బందు మిత్రులందరూ నా పేరు ను
పిలిస్తున్నారు.
తలుస్తున్నారు ...

నాకు నిద్ర పట్టదని తెలిసి
కట్టెలపై నే పడుకో బెడుతున్నారు .
నాకు నిప్పంటే భయమని తెలిసీ ,
 నిప్పంటిచ్చేస్తున్నారు .
ఒంటరి తనాన్ని భరించ లేనని తెలిసీ,
 ఒంటరి గా వదిలేసి వెళ్తున్నారు .

నా నిండు దేహాన్ని
నిర్దాక్షిన్యంగా కాల్చేసి,
బొమ్మకి బొట్టు పెట్టి,
గోడకి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

నా పునః నామకరణ
మరణ మహోత్సవానికి
పత్రికలచ్చు వేయించి,
అందరిని ఆహ్వానిస్తున్నారు...

               ఇప్పుడు నేను కీర్తి శేషుడను ...

No comments:

Post a Comment