20130815

ఎగిరి పోవాలని ఎగురుతున్నది మూడు రంగుల జెండా

ఎగిరి పోవాలని  ఎగురుతున్నది మూడు రంగుల జెండా

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

తలలు తెగిన జవాన్ల రక్తం తో ఎరుపెక్కి ఎగురుతున్నది,
బాడర్లో చచ్చే బిడ్డలను చూస్తూ చావలేక ఎగురుతున్నది,
ఉగ్రవాదుల బాంబు దాడులు భరించలేక చెవ్వులు మూసుకుని ఎగురుతున్నది, 
బలం లేని రక్షణ బలగాలను చూసి బలహీనపడి ఎగురుతున్నది,
  
ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

స్వార్ద రాజకీయుల చేతుల్లో ఉండలేక ఊడిపోవాలని ఎగురుతున్నది,  
విదేశీ ఆక్రమణలు జరుగుతున్నా తనకేం పట్టనట్టు తెల్ల మొహం వేసుకుని ఎగురుతున్నది ,
చేతగాని ప్రభుత్వాలతో చేసేది ఏమి లేక చేతులు ముడుచుకుని ఎగురుతున్నది,  
అవినీతి కోరలు చాచిన అప్రజాస్వామికత ను చూసి అసహ్యించుకుని  ఎగురుతున్నది,
కంపు కొట్టే కుంభకోణాలను చూడలేక కళ్ళు మూసుకుని ఎగురుతున్నది. 

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

మానవత్వం లేని ఈ మనుషుల మద్య ఉండలేక మబ్బుల్లో ఎగురుతున్నది,  
కన్న వాళ్ళను వదిలేసి పరాయోల్లతో కునికె కసాయోల్లను చూసి కన్నీటితో ఎగురుతున్నది, 
పట్టెడన్నం కుడా  దొరకని వీది బాలల గోడు వినలేక విసిగిపోయి ఎగురుతున్నది, 
పెరుగుతున్న నిరుద్యోగులని చూసి నివ్వెరపోయి నిస్సహాయంగా ఎగురుతున్నది.
రైతుల ఆత్మహత్యల తో, తన లో పచ్చదనం తగ్గిపోయి ఎగురుతున్నది. 

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

మందు మత్తులో మునిగి తేలుతున్న యువతరాన్ని చూసి ముక్కు మూసుకుని ఎగురుతున్నది, 
కామాందుల కంట పడకుండా తన దేహాన్ని దాచుకుంటూ సిగ్గుపడి  ఎగురుతున్నది,
ఆడ బిడ్డలా బౄణ హత్యలు చూసి, తనదీ ఆడ జాతేనని అందకుండా ఎగురుతున్నది,
వంద కోట్ల భారతీయుల భవిష్యత్తు ను తలిచి బాధ పడుతూ భయపడి ఎగురుతున్నది. 

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ... 
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన... 
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని  ఎగురుతున్నది ఎర్రకోట మీద. 

20130812

మోడీ

 ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మోడీ పై చేసిన వాక్యలు ...
పొట్టేలు, కొండను  ఢి  కొట్టినట్టు ఉంది...
అయిన మేక పోతు గాంభీర్యం ప్రదర్శించటం మన CM గారికి బాగా అలవాటయింది ఈ మద్య కలం లో...  ఏమంటారు ???