20130804

సమైక్యం


సమైక్యం , ఐకమత్యం ... ఐక మత్యమే మహా బలం అని నేను ఒప్పుకుంటాను కానీ అది కొన్ని సందర్బాలల్లో మాత్రమే ...
ఐక మత్యమే మహా బలం అయితే మహాత్మా గాంధీ గారు, మహమ్మద్ జిన్నని గళ్ళ పట్టుకుని ఎందుకు ప్రశ్నిచలేదు మనం కలిసే ఉందాం అని  ?
సమైక్యమే బలం అయితే ఆంధ్రులు , తమిళులతో ఎందుకు కలిసుండలేక పోయారు ?
భాషే బలం అయితే కొరియా రెండు దేశాలు గ ఎందుకు విడిపోయింది  ?
అందరం మనుషులమే అయితే మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నట్టు ?
అందరు సమానమే అయితే ఇన్ని యుద్దాలు ఎందుకు జరుగుతున్నాయి ?
ప్రాంతాలన్నీ ఒక్కటే అయితే ఈ ప్రపంచం ఇన్ని దేశాలు గా ఎలా ముక్కలయింది ?
ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఎలా పుట్టుకొచ్చాయి ?

సమైక్యమే బలం అంటే, ఎవడి ఇంట్లో వాడు ఉండడం ఎందుకు ? సామూహిక వంటలు , సామూహిక నిద్ర పోవచ్చు కదా ...

ఒక జాతి నిరాదరణకి , నిర్లక్షానికి గురై నప్పుడు లేదా ఒక నిమ్న జాతి పై మరో జాతి ''పెత్తనం, అజమాయిషీ''
చలాయిన్చినప్పుడు...  ఆ జాతి నుండి ఉత్పన్నం అయ్యే వ్యతిరేకతే "విప్లవం " "ఉద్యమం ". 

అలా కసి తో  పుట్టుకొచ్చిన ఉద్యమం  , ప్రాంతం భాష  బందాలను వేటిని లెక్క చేయదు.

ఇకపై ఒకే భాష మనది , ఒకే రాష్ట్రము మనది అని సన్నాసి కబుర్లు చెప్పే వాడికి ఇది నా హెచ్చరిక ...  

చదువుకోడం


నాకు తెలిసి చదువుకోడం అంటే చాలా కష్టం అని , కానీ అంత కస్టపడి చదివిన నాకు ఆ చదువు ఎందుకు చదివానా అని సిగ్గుగా ఉంది . ఎవడి చరిత్రనో నా నోటితో చదివించి చదివించి , నాకు చరిత్రే లేనట్టుగా  చేసారు .
బందరు వెళ్ళిన నాన్న లు బొమ్మలు తెచ్చారే గని , దుబాయ్ వెళ్ళిన ఎంతో మంది నాన్న లు ఏమి తేలేదేందుకు ?

కృష్ణ దేవరాయల గొప్పదనాన్ని చూసాను గని , నవాబుల నిరకుశత్వాన్ని  నాకెవరు చూపలేదు ?
వికట కవి అని ఉప వాచకాల నిండా ఉంది  కానీ , కాకతీయ రాజుల గురించి వారి సామంతుల గురించి ఎక్కడ లేదు .
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న విగ్రహాల గురించి చెప్పారే తప్ప , ఆ సాగర్ ని తవ్విన్చినో డి ని మాత్రం కనీసం తలవనుకుడా తలవలేదు ...
ఎక్కడో ఒంగోలు లో పుట్టిన ప్రకాశం పంతులు మా పుస్తకాలల్లో ప్రాణం పోసుకున్నాడు గని ,ఆదిలాబాద్ లో పుట్టిన  కొమురం భీమ్ మాత్రం పుస్తకాలల్లో ప్రాణం పోసుకోలేదు .

చీరాల పేరాల పోరాటం గొప్పది అయినప్పుడు , జగిత్యాల జైత్రయాత్ర ఎందుకు గొప్పది కాలేదు ?

సర్ అర్ధర్ కాటన్ బ్రిడ్జి గురించి రాసారు గని , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేదేమో మరి ?

నా రాష్ట్రము అన్న పూర్ణ అని గోదారి జిల్లాల గురించి చెప్పినప్పుడు , సహజ వనరుల జిల్లాలు ఆదిలాబాద్ , ఖమ్మం ల గురించి చెప్పలేదు .

విజయ వాడ  కనక దుర్గ కి దక్కే గౌరవం , మా బాసర సరస్వతి కి దక్కదు .
ఇంకా వేములాడ రాజన్న , కొండగట్టు అంజన్న లయితే ఆడికాడికే...

జెండా రూపకర్త  గని , ప్రతిజ్ఞ రాసిన నల్లగొండ వాడు మనోడు కాకుండా పోయాడా ?

 నాకిప్పుడే అర్ధం  అయితంది , నేను చిన్నప్పుడు తిన్న జొన్న గడుక ,జొన్న అంబలి ఇప్పుడు ఇడ్లి లుగా  ఎలా మారాయా అని , సింగరేణి బాయి ల మీద ఉన్న పోచమ్మ , మైసమ్మ లు నేడు కనక దుర్గలు గ ఎలా మారారు అని ,
ఆనిక్కాయకు రెండు పేర్లు ఉన్నాయని మురిసి పోయాను గాని , ఇంకో పేరు పరాయోడి పెత్తనపు రుద్దుడని అర్ధం అయింది .

మీ పాదాలు కడగడానికే


తెలంగాణా లో ఇప్పుడు కురుస్తున్నది వర్షం  కాదు ,
 నాకు తెలుసు అమరులారా అవి మీ   ఆనంద భాష్పాలని .
 ఈ వీచే చల్లని  గాలులు నాకు తెలుసు మీ ముసి ముసి నవ్వులని ,
నాకు తెలుసు మీరే  ప్రవహించె నది  నీళ్లై ఈ స్వేచ్చా భూమిని తనివి  తీరా స్పృశిస్తున్నారని,
 ఈ కమ్ముకున్న కారు మబ్బులు, నాకు తెలుసు  మమ్ములను మీ గుండెలకి హత్తుకున్న క్షణాలని,
నాకు తెలుసు  రాలుతున్న ఆకులన్నీ ఈ జాగను ముద్దాడే మీ పేదాలని ,
 నా  అన్నలారా తెలంగాణా  వీరులారా,నాకు తెలుసు  నా కళ్ళ లో గిర్రున తిరిగే ,
కన్నీరంతా మీ పాదాలు కడగడానికేనని...
జై తెలంగాణ జై జై తెలంగాణా ...

బానిస సంకేల్లు


60 ఏళ్ళ బానిస సంకేల్లు తెగే క్షణం . 
గొంగలి పురుగు, బస్మంత అయ్యే క్షణం
గుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షి రెక్కలు విప్పే క్షణం .
 రెక్కలు తొడిగిన పక్షి  విహంగానికి ఎగిరే మధుర క్షణం ...
నా స్వప్నం నా రాష్ట్రం  పురుడు పోసుకుంటుంది ...
ఈ దేశానికి 29 వ బిడ్డ గ జన్మించబోతుంది నా తెలంగాణా