20130918

వరంగల్లు

"ఓరొ"క్కటి "గల్లూ"రు

బతుకంటే బతుకు నాది బతుకమ్మల బతుకు ,
జాగంటే జాగ నాది బోనమెత్తిన జాగ. 
సమ్మక్క సారక్కలు , సాకలి ఐలమ్మలు ,
రాణులకే రాణులు రాణి రుద్రమ్మలు.
వడ్డేపల్లి , పాకాల, లక్నవరం, భద్రకాళి, రామప్పలు
పంచ వర్ణ శోభితాలు.

ద్వాదశ మొదలు చతుర్దశ కాకతీయ పాలితం
ద్వి శతేండ్ల మహా దివ్య చరితం.
గణపతి దేవుని మొదలు రౌద్రం గల వంశమది
తెలుంగును పన్నీరుగా చేసి పంచిన  తెలంగాణమది
ఆనాడే వెలిసేను మా గాణము ఘనముగా
కన్నడిగుల నామమది "ఓరొ"క్కటి "గల్లూ"రు  
 ఏకశిలా నగరమే మనది నేటి వరంగల్లు.

 శిల్పకళ శిళా తోరణమే తెలంగాణా కళల దర్వాజా
వెయ్యి స్తంబాల గుడి మా కోటి పుస్తకాల బడి,
దిశా దిక్కులను చూపే స్థితి స్తంభాలే మొదటి పడి
 నీటిలోన తేలియాడే రాతి గుడి రామప్ప ,
స్వరాలొలికించే స్తంభాలా రాణా రుద్రసమనీంద్రజాలం .
నందీశ్వరుడు చాలొక్కడు నివ్వెరపోయి చూడ
అతిలోక సుందరీ మనులనే తనలో ధరించిన ఖిలా వరంగల్
దేవేంద్రులనే శిల్పించిన రేచర్ల రుద్రుని పాలంపేట.

 ఏటూరు నాగారం వన సంపద
ఆది కవి సోమన్న శతానాదాలు,
వానమామలై వరదన్నపద్యాలా వరదలు ,
 ప్రజా కవి కాళన్న కవితా నారాయణులు,
ఓరుగల్లె కదా అరవై నాలుగు కళల ఖజానా.

జై తెలంగాణ జై జై తెలంగాణా                                

20130917

ఓ కళాకారుడా ...

ఓ కళాకారుడా ... 

కళనే కళ గా గుర్తెరగనప్పుడు,
ఏమిరా నీ  కళ లోని సౌందర్యం. 
సంపదనే కళగా గుర్తెరిగినప్పుడు ,
 ఎవడినానందపరుచు నీ కళలోని రూపమ్ము.
ఈ ధూమ సమాజం ఏ కవికిచ్చు దేహ గౌరమ్ము ?

 ఓ కళాకారుడా ... ఓ చిత్ర కారుడా ...
ఏ చిత్రమైన నీ జీవిత చట్రాన్ని మార్చింద ?
మద్య తరగతి పోరు ఇసుమంతైనను,
 సాగర మదనం తో తూగునయ .
మేట్లేన్ని ఎక్కినను, మాటలెన్ని పొందినను,
పాదమ్ము మట్టి తోక్కక మానదయా .
మర్మ మెరగరా సిత్ర కారుడ  నా విచిత్ర సోదరా ...

ఓ కళాకారుడా .. ఓ కవి పుంగవా...
నిను మోయగ లేదు, నిను కాపాడగ రాదు,
ఎవనికెంత చెప్పిన అవగతమవగనూ రాదు ,
అవసరమేమున్నదయ ఎవనికేమి జెప్ప .

శొదించి కళ సాధించిన గాని ,
 సంపాదించగ లేని కళ ఉండగనేమి అది ఉడగనేమి ?

కవితలెన్ని రాసినా కంచం నింపగా లేదు
బొమ్మలెన్ని గీసినా ఏ బొమ్మ దరికి చేరగా రాదు
పాట లెన్ని పాడినా పుట గడవబోదు.
ఆటలేన్ని ఆడినా అలసి పోక తప్పదు , అటకెక్కక మానవు .

పొట్ట నింపని కళను పట్టించుకొను వాడెవ్వడు ?
పట్టువిడవక ధీరుడు పొట్ట చేతపట్టు వాడెవ్వడు ?
కల చేతపట్టి కలకాలం బతుకుట కంటే ,
ధనం చెంత చేరి కొంత కాలం బతుకుట మేలయా ..
అతి సామాన్యుడ నేనయా ...

 కళ కను గొన గల ప్రయాణం సుదూరం
కళ గల హృదయం కఠిన సున్నితం
కళ గన లేని హృదయం కఠినాతి కఠినం
ఈ శతాబ్ది కిదే జగమెరిగిన మర్మం .

ప్రోత్సహించని చోట ప్రోద్భలము దొరకునా ?
విలువ లేని చోట పువ్వై విచ్చు కొందువా ?
కళల మద్య బతకలేవు మద్య తరగతి వాడిగా ,
కళని చంపి బతుకు చచ్చిన శవంగా ...

పంపకాలు

పంపకాలు 

ముద్దు ను పంచుకున్నం మురిపెం పంచుకున్నం
మాటని పంచుకున్నం, మమతని పంచుకున్నం
కోపాన్నిపంచుకున్నం,  క్రోధాన్ని పంచుకున్నం
నవ్వును పంచుకున్నం, నష్టాలను పంచుకున్నం.
కష్ట సుఖాలను, వెలుగు నీడలను
మొలిచిన మొక్కలను, పెరిగిన కొండలను
హిమాలయాలను, హిమని నాదాలను
కట్టే గోడను , కొట్టే చెట్టును
రాలే ఆకును , పూసే పూతను, కాసే కాతను
రాలే పిందెను పండే పండును పంచుకున్నం
తినే కంచాన్ని తాగే గ్లాసు ను , పోయే పాయకానను
భారతం  లో ఏకంగా భార్య నే పంచుకున్నం.
ఉరిలో దేవుణ్ణి పంచుకున్నం.
ఉరి చివర స్మశానాన్ని పంచుకున్నం.
పంపకాలు జరగని దెక్కడ ? పంచలేని పంచ భూతమేక్కడ ??
పగిలిన పలక విరిగిన బలపం , పంపకాలకు కాదేది అతీతం .
పంపకం లేనిదే పరిహారం ఉంటుందా ? సమస్యకు పరిష్కారం వస్తుందా ?

జై తెలంగాణా జై జై తెలంగాణా

నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా .

నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా

రాతి మనిషి వాడు రాటు దేలినోడు
తిని బతకక వాడు తిక్క వేషమేసిండు .
రాజజే సరైనోడు వాణ్ని మెడ వట్టి దొబ్బిండు ,
ముల్లెలన్ని ముట  గట్టి ముంత వట్టుకొచ్చిండు .
పిచ్చోడు వాడు పిట్టల దొరవొకడు,
భాషోక్కటన్నాడు , భందమేసుకున్నాడు,
బంజరు భూముల్లో జేరి బల్ల గుద్దుతున్నాడు ,
బద్మషు బాబు వాడు , బతకనేర్సినోడు ,
నా జాగల బొక్కేనేసి అడుగునంత తోడిండు .
కాలుకేసి ఏలుకేసి ఉన్నదంతా ఉడ్సిండు .
వెనుకటి కాలనికొకడు వేర్రిబాగులోడు ,
నోరు  మెదపనూ లేదు , కాలు కదపనూ లేదు
కన్నీరోడుతున్న కనికరించనూ లేదు .
మొండోడు వాడు మోడు బతుకు వాడిది .
అరవయ్యేళ్ళ అభివృద్ధి పేరు జెప్పి అరిగోస పడుతున్నడు.
 కిరాయికి అచ్చినోడు కిరికిరి జేసి కిరీటం నదంటున్నడు.
ఊరి కొస్సకు కూసోని ఊరు నాదంటున్నడు.
తెగిన్చినోడు వాడు తెగ బలిసినోడు ,
 అయ్య పేరు జెప్పి వాడు ఐకుంటం ఎక్కినాడు .
మాట మర్చినవాడు నేడు చిప్ప కూడు తింటాండు .
కుతుబ్షాహిలు , మొగలసఫ్ జాహీ లు
నాల్గొందలేండ్ల లో వాడేనాడు జోచ్చిందో ?
 ఎవడబ్బ సొమ్మని రామచంద్రా వాడు నిన్నెట్లా అడగవట్టే రామచంద్రా .
ముదనష్ట పోడు వాడు ముస్టడుగుతున్నడు.
హిందీ అంటే రానోడు ఉర్దంటే పడనోడు,
ఉండబట్టలేక వాడు ఉమ్మడంటున్నడు.
పాపమని పాలిస్తే , పొదుగు నదంటండు .
పుక్యానికి అచ్చినోడు పబ్బం గడుపు కున్నడు .
పని పాట లేక వాడు , పట్నం నాదంటున్నడు...

జై తెలంగాణా జై జై తెలంగాణా ...