20130917

ఓ కళాకారుడా ...

ఓ కళాకారుడా ... 

కళనే కళ గా గుర్తెరగనప్పుడు,
ఏమిరా నీ  కళ లోని సౌందర్యం. 
సంపదనే కళగా గుర్తెరిగినప్పుడు ,
 ఎవడినానందపరుచు నీ కళలోని రూపమ్ము.
ఈ ధూమ సమాజం ఏ కవికిచ్చు దేహ గౌరమ్ము ?

 ఓ కళాకారుడా ... ఓ చిత్ర కారుడా ...
ఏ చిత్రమైన నీ జీవిత చట్రాన్ని మార్చింద ?
మద్య తరగతి పోరు ఇసుమంతైనను,
 సాగర మదనం తో తూగునయ .
మేట్లేన్ని ఎక్కినను, మాటలెన్ని పొందినను,
పాదమ్ము మట్టి తోక్కక మానదయా .
మర్మ మెరగరా సిత్ర కారుడ  నా విచిత్ర సోదరా ...

ఓ కళాకారుడా .. ఓ కవి పుంగవా...
నిను మోయగ లేదు, నిను కాపాడగ రాదు,
ఎవనికెంత చెప్పిన అవగతమవగనూ రాదు ,
అవసరమేమున్నదయ ఎవనికేమి జెప్ప .

శొదించి కళ సాధించిన గాని ,
 సంపాదించగ లేని కళ ఉండగనేమి అది ఉడగనేమి ?

కవితలెన్ని రాసినా కంచం నింపగా లేదు
బొమ్మలెన్ని గీసినా ఏ బొమ్మ దరికి చేరగా రాదు
పాట లెన్ని పాడినా పుట గడవబోదు.
ఆటలేన్ని ఆడినా అలసి పోక తప్పదు , అటకెక్కక మానవు .

పొట్ట నింపని కళను పట్టించుకొను వాడెవ్వడు ?
పట్టువిడవక ధీరుడు పొట్ట చేతపట్టు వాడెవ్వడు ?
కల చేతపట్టి కలకాలం బతుకుట కంటే ,
ధనం చెంత చేరి కొంత కాలం బతుకుట మేలయా ..
అతి సామాన్యుడ నేనయా ...

 కళ కను గొన గల ప్రయాణం సుదూరం
కళ గల హృదయం కఠిన సున్నితం
కళ గన లేని హృదయం కఠినాతి కఠినం
ఈ శతాబ్ది కిదే జగమెరిగిన మర్మం .

ప్రోత్సహించని చోట ప్రోద్భలము దొరకునా ?
విలువ లేని చోట పువ్వై విచ్చు కొందువా ?
కళల మద్య బతకలేవు మద్య తరగతి వాడిగా ,
కళని చంపి బతుకు చచ్చిన శవంగా ...

No comments:

Post a Comment