20130918

వరంగల్లు

"ఓరొ"క్కటి "గల్లూ"రు

బతుకంటే బతుకు నాది బతుకమ్మల బతుకు ,
జాగంటే జాగ నాది బోనమెత్తిన జాగ. 
సమ్మక్క సారక్కలు , సాకలి ఐలమ్మలు ,
రాణులకే రాణులు రాణి రుద్రమ్మలు.
వడ్డేపల్లి , పాకాల, లక్నవరం, భద్రకాళి, రామప్పలు
పంచ వర్ణ శోభితాలు.

ద్వాదశ మొదలు చతుర్దశ కాకతీయ పాలితం
ద్వి శతేండ్ల మహా దివ్య చరితం.
గణపతి దేవుని మొదలు రౌద్రం గల వంశమది
తెలుంగును పన్నీరుగా చేసి పంచిన  తెలంగాణమది
ఆనాడే వెలిసేను మా గాణము ఘనముగా
కన్నడిగుల నామమది "ఓరొ"క్కటి "గల్లూ"రు  
 ఏకశిలా నగరమే మనది నేటి వరంగల్లు.

 శిల్పకళ శిళా తోరణమే తెలంగాణా కళల దర్వాజా
వెయ్యి స్తంబాల గుడి మా కోటి పుస్తకాల బడి,
దిశా దిక్కులను చూపే స్థితి స్తంభాలే మొదటి పడి
 నీటిలోన తేలియాడే రాతి గుడి రామప్ప ,
స్వరాలొలికించే స్తంభాలా రాణా రుద్రసమనీంద్రజాలం .
నందీశ్వరుడు చాలొక్కడు నివ్వెరపోయి చూడ
అతిలోక సుందరీ మనులనే తనలో ధరించిన ఖిలా వరంగల్
దేవేంద్రులనే శిల్పించిన రేచర్ల రుద్రుని పాలంపేట.

 ఏటూరు నాగారం వన సంపద
ఆది కవి సోమన్న శతానాదాలు,
వానమామలై వరదన్నపద్యాలా వరదలు ,
 ప్రజా కవి కాళన్న కవితా నారాయణులు,
ఓరుగల్లె కదా అరవై నాలుగు కళల ఖజానా.

జై తెలంగాణ జై జై తెలంగాణా                                

No comments:

Post a Comment