20111126

వదలరా ఇకనైన  
ఏమున్నది ఏమున్నది, మాదగ్గర ఏమున్నది, 
వద్దన్నా వినక గుండె మీద తుపాకి గుండు బెట్టి,
సంస్కారం అని సాకు జూపి సొత్తిరి మా ఇంట 
యాబది ఎండ్లైన విడవక... 


ఏమున్నది ఏమున్నది మా దగ్గర ఏమున్నది 
ఇచిన్న పాలు సాలక, పొదుగు చేత కొల్ల గొట్టి,
జలగ వలె బట్టి, పీల్చి పీల్చి పిప్పి జేస్తివే,
బాదుల బంధాలు కల్పి, నగర్ ల నాయకత్వం జూపి,
సంది బండల దూరి, సర్కారీ కొలువుల జేరి,
ఎతైన పీటభూమి ఎక్కి ఎతైనోడివైతివే...


ఏమున్నది ఏమున్నది మాకేమున్నది, 
గని బతుకులు సాలక గల్ఫ్ దేశమేగి,
ఖైదీ లై  కనుమరుగవుతుంటే...
ఉన్న జాగ పోరుగోడికిచ్చి, పద పద మని 
పరుగున పొరుగు దేసం బొయినొల్లను 
కన్నీటితో కాటికి పంపే సిక్కిన సీకట్ల బతుకులు 
సాలింక మాకిక సాలు ...


ఏమున్నది ఏమున్నది
ఆనాటినుండీనాటివరకేమున్నది ?
నిజాం  నోట నోళ్ళు మూసి, సర్కారు కాలం ల కళ్ళు మూసి
మూసి మూసి, మూసి మురుగు  లోన మాసి పోయిన
బానిస బతుకులు సాలింక మాకిక సాలు 


వదలరా ఇకనైనా నా తల్లిని, నా తెలంగాణా తల్లిని...   

No comments:

Post a Comment