20121104

దేహం పై ద్వేషం 

పోరాటానుభవాలకు చేయూత నివ్వడం లేదని ద్వేషం తో,
చచ్చిన నా దేహానికి, ఆనంద పరవశం తో దూరం అయి
శ్వాస కంటే వేగంగా,  కను రెప్పల బారికేడ్ల సందుల్లోంచి
టియర్ గ్యాస్ సప్పుల్ల కను  చూపు మేరాల్లో, పోరాట వీరుల కవాతులో
నా మనసంతా ఉవ్వేత్తున ఎగిసిన ఉద్యమం ల చేరాలని ఊగిసలాడుతునే ఉన్నది.

మొన్నటి మిలియన్ మార్చ్ లో ద్వంసం అయిన విగ్రహాల్లాంటి మహా కార్యాన్ని
పునః ప్రతిష్టించి మరో తీపి జ్ఞాపకాన్ని నా ఉద్యమ కాల పత్రం లో,
సాగర హారం లో రాలిన రక్తపు బోట్ల తో చరిత్ర లోకి ఎక్కించాలని నా మనసంత ఉవ్విళ్లూరుతున్నది .

సాగరపు ఒడ్డున తిరిగిన జ్ఞాపకాలన్నీ  నెమరు వేసుకుంటూ,
శిథిలం చేయడానికి అనువైనదాని కోసం ఆణువణువూ వెతుకుతూనే
ఉన్నాయ్ నా అక్షములు...

నిమజ్జనం అయిన వినాయకులందరూ మిమ్మల్ని మేం కాపాడుతం అంటూ
ఒడ్డుకు చేరి కావలున్నారు ...

జై తెలంగాణా జై జై తెలంగాణ 

No comments:

Post a Comment