20130929

రా... రా... విస్పోటనపు కవిత్వమై

రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై

ఓరి సమైక్యాంద్రుడా నీ తాత లు నేర్పిందేందిరా ?

 ఓ అమరజీవి నీ త్యాగ ఫలమా ఇది
నీ వేర్పాటువాద రాజ్యమే వికటించి
మాపై విషం చిమ్ముతుంది
రా విగ్రహం విదిలించుకు రా ... రా ...
ఈ విధి నుండి విడిపించుటకు

గుర్రం జాషువా
కవి గాంచలే, రవి అసలే గాంచలే
కానీ ఆంధ్రుడు తెలంగానమున గాంచి
మా గుండెలను గుర్రపు డెక్క లతో పొక్కిలి జేస్తున్నడు
రా మా గోడు వర్ణించగ  రా ... రా ...  గర్జించే గళమై

వీరేశలింగం, గురజాడ లూ
మీ వీరులు జాడలు మరచి
మాకు గ్రహనమై పట్టిన్లు
రా గురజాడా  గురువై రా... రా... వీరి గుణాలను మార్చేందుకు
రా... రా...  వీరేశలింగం విడుపు కాగితం విప్పించుటకు ...

శ్రీ శ్రీ దొరా... నీ బిడ్డలకు నేర్పిందేందయ్యా ?
తాజ్ మహల్ కు రాళ్లెత్తిన కూలీలెవరని అడిగితివే !
మరి గోల్కొండ కు రాల్లెత్తిన కూలీలను మర్సిందా నీ జాతి ?
రా కదిలించుకు రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై
ద్రుతరాష్ట్రులకు  కనుచూపులు మొలిపించ !

 జై తెలంగాణా జై జై తెలంగాణా  


No comments:

Post a Comment