20130929

తెలంగాణా పెద్ద బిడ్డ

తెలంగాణా పెద్ద బిడ్డ


పది జిల్లాల తెలంగాణా లో హైదరాబాద్ తొలుసూరు బిడ్డ
పాలిచ్చి పెంచుకున్నాం , ప్రాణమిచ్చి సాదుకున్నం

ఎన్నో శతాబ్దాల కడుపు కోతను అనుభవించి
ఎందరో నవాబుల శస్త్ర చికిత్సల తర్వాత
పుట్టిన నా పట్నం నాది కాకుండా పోతదా ?

కుళీకుతుబ్షా ,భాగ్మతీల భాగ్యనగరం నాదే
ఉసేన్ సాగర్ నీరు మా చెమట చుక్కల కు ప్రతిరూపం
మా తాత ల మాంసపు ముద్దల అందమే ఆ చార్మినార్

కంచర్ల గోపన్న ను ఖైదీ గ బందించిన గోల్కొండ సాక్షి గా
చతుర్ముఖి చౌ మహల్లా ప్యాలస్ సాక్షి గా
హైదర్ అలీ , సికిందర్ షా ల సాక్షి గా
సాలార్ జంగ్ , చార్ కామాన్
లక్డి క పూల్ , పురాణా పూల్ చెరువుల సాక్షి గా
హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణే

పది నేలలున్న సీత లంకదై పోదురా
ల్యాంకో దహనానికి తెలంగాణానుమంతులున్నారు
రామ యుద్ధం జరగబోతోంది సూడు
రావణాంద్రుడా ఓరి లాగడరాయపాటిగా...
జై తెలంగాణా జై జై తెలంగాణా


 

No comments:

Post a Comment