20130430

విప్లవం

ఈనాడు మనం అనుభవిస్తున్న ఫలాలన్నీ,
ఏనాడో  విప్లవం నాటిన విత్తనాలే...

అనుభవించే వాళ్ళంతా బకాసురులైతే,
విప్లవ విత్తన ఫలాలనుండి వచ్చే
విత్తనలన్ని మొలకెత్తి మహోద్యమ వృక్షాలయ్యేవే...

విప్లవం వర్ధిల్లుతుంది 

20130427

modi

15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసి దేశ ప్రజల మన్ననలు పొందిన మోడీ కె ఒక దేశాన్ని పాలించే సమర్థత , అర్హత లేకుంటే,
 కనీసం ఒక ఊరికి సర్పంచ్ గ కూడా పనిచేయని రాహుల్ గాంధీ కి ప్రధాని అయ్యే అర్హత, సమర్థత ఎక్కడినుండి వచ్చాయో  మరి ???
ఒక రాష్ట్రాన్ని పాలించినoత సులువు కాదు ఒక దేశాన్ని పాలించడం అన్న సల్మాన్ ఖుర్షిద్(విదేశాంగ శాఖ మంత్రి ) గారి దృష్టిలో  ఒక మంత్రి గ కూడా పని చేయని రాహుల్ గాంధీ కి దేశాన్ని పాలించడం అంత సులువా మరి ???

20130402

డబ్బింగ్ సీరియల్లు

డబ్బింగ్ సీరియల్లు వద్దు, తెలుగు సీరియల్లు ముద్దు అని ఈ మద్య  తెగ మీటింగులు పెట్టి స్పీచులు ఇస్తున్నారు.
ఆ డబ్బింగ్ సీరియళ్ళ వల్ల తెలుగు బుల్లితెర నటీ నటులకు అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రజలు కూడా తెలుగు సీరియల్లె చూడాలని విన్నపిస్తున్నారు. 
దాసరి నారాయణ రావు గారు ఇలాంటి వాటికీ అండగా నిలిచి గొప్ప వీరునిలా కన్పిస్తున్నారు. అలాంటి వారందరికి న పాదాభి వందనాలు. 

వాళ్ళకి నేను కూడా నా మద్దతును తెలుపుతున్న. కొన్ని వేల మంది కి ఈ సీరియల్లె జీవనోపాధి. అలాంటి వారి పొట్ట కొట్టడం సరి కాదనేది నా భావన. వారిదొక అస్తిత్వ పోరాటం. ఒక వర్గం మరొక వర్గం పై చేసే దాడి ని ఎవరైనా ఖండిచాల్సిందే. 

సమస్య మీదగ్గరికి వచ్చే దాక మీకు అర్ధం కాలేదు. కొన్ని దశాబ్దాలు గా జరుగుతున్న తెలంగాణా పోరాటం కూడా ఒక అస్తిత పోరాటమే కదా. ఒక జాతి ప్రజలపై మరో జాతి చేస్తున్న అసాంఘిక దాడి ని సహించకనే కదా తెలంగాణా ఉద్యమం ఉవ్వేతున లేచింది. 

మరి అలాంటప్పుడు డబ్బింగ్ సీరియల్లని ఆపాలని స్టేజి ల మీద వాగుతున్న ఈ నా __ కొడుకులు రాజ్య సభ లో M.P. లుగా చలామణి అవుతూ తెలంగాణా కోసం నోరు మెదపరెందుకో ??? 


20130227

మగాడ నీకు సలాం

 మగాడ నీకు సలాం 


కామాగ్ని కి దహనం ఐన అమానత్ కి అండగా నిలబడిన ఓ మగాడ నీకు సలాం 

ఆ మగాల్లే మృగాలు గ ప్రవర్తించిన క్షణాలెన్నో డిల్లి పుర వీదుల్లో క్యాండిల్ కాంతులు వెదజల్లు తున్నై,
మగాళ్ళ మనసు లో చెక్కిన బూతు బొమ్మలకు ఎన్ని రోజులు వేయగాలవోయ్  ఈ ముసుగులు 
మూతులు నాకిన  పెదా లన్ని ఎన్ని రోజులు పలక గలవా  నినాద పదాలను ?
తెలిసీ తెలియనట్టు గా తాకినా వక్షోజాను భూతపు హస్తాలు ఎన్ని రోజులు పట్టగలవా రాతల పలకలను ?
చెట్లల్లో పుట్టల్లో నీవు జరిపిన దాష్టీకం ఎవరూ చూడలే అనేగా నీ సంబరం 
నీ రహస్యపు రస క్రీడా లో,  కాపాడాలంటూ కారిన కన్నీటి చుక్కలకు 
సజీవ సాక్షాలుగా మూగబొయి  ఊగుతున్న ఆకులెన్నో మిత్రమా 
కటిక విష దేహం తో చేదిన్చిన కటీ వలయలన్నీ మిణుగురు పురుగులై 
పగటి వేళ ఆకాశం లో వేలాడుతున్నై 
స్వప్నాల్లొనూ స్వర్గాలను చూడాలని ఎవరూ లేని నలుగు గోడల మద్యలో 
నీ అవయవమేనని కుడా చూడకుండా బలత్కరించి స్ఖలించిన 
స్ఖలనాలన్నీ మరుగు దొడ్లో మురుగు కంపు కొడుతూనే ఉన్నాయ్  రా మ్రుగాడ
 

20130224

India

దేశ పరిస్థితి ని, ఆర్దిక,  సంస్కృతిక, సాంఘిక, సాంకేతిక అభివృద్ధి, దృష్ట్యా రాజ్యాంగం లో కొన్ని మార్పులు చేస్తారు . ఇప్పుడు మన ప్రతిజ్ఞ కి కూడా మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. 
భారతదేశం నా మాతృభూమి. దేశ ద్రోహులందరూ  నా సహోదరులు.
నేను ఉగ్రవాదాన్ని  ప్రేమించుచున్నాను. కుల మత విద్వేషాలు, బహువిధమైన నా దేశ అవినీతి వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రున్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిన్నిఅవమానించే వారిని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.
నా దేశంపట్ల , దేశ ద్రోహుల,అవినీతి పరుల పట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్

20130222

MERA BHARATH

ఉగ్రవాదులను శిక్షించకుండా, వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని విచారణలు జరిపే కేంద్ర ప్రభుత్వాలు,
వచ్చే ఎన్నికల్లో ఐన గెలుపు కోసమే దాడులను  తీవ్రంగా ఖండించే ప్రతిపక్షాలు,  ఎక్స్ గ్రే షియా  లతో చేతులు దులుపుకుని ప్రజల ఓట్లను రాబట్టాలనుకునే  రాష్ట్ర ప్రభుత్వాలు
ఉన్నంత వరకి, ఈ అమాయకపు ప్రజలు దేశం లోని ఇంకెన్నో  ఉగ్రవాద దాడుల్లో  లలో ప్రాణాలు విడవాల్సిందే...

మేరా భారత్ మహాన్, జై హింద్, PROUD TO BE AN INDIAN

20130214

కృతజ్ఞత 

ఎంతో కాలం ప్రేమించుకొని, తనివి తీరా కామించుకుని,
పెద్దలకి ఎలా చెప్పాలో తెలీక నానా తంటాలు పడి,
చివరికి ప్రేమించి కామించిన వాళ్ళని వదల లేక వదిలి,
ఎవరినో పెళ్లి చేసుకునే దౌర్భా గ్యం రాకుండా,
పార్కుల్లో ప్రేమించుకునే, సందు దొరికితే కామించుకునే
మాలాంటి అభాగ్యులను మీలాంటి(VHP , బజరంగ్ దళ్) వాళ్ళు ఆదరించి
పెళ్లిళ్ళు  చేస్తున్నందుకు నా హృదయ పూర్వక అభినందనలు

20121104

దేహం పై ద్వేషం 

పోరాటానుభవాలకు చేయూత నివ్వడం లేదని ద్వేషం తో,
చచ్చిన నా దేహానికి, ఆనంద పరవశం తో దూరం అయి
శ్వాస కంటే వేగంగా,  కను రెప్పల బారికేడ్ల సందుల్లోంచి
టియర్ గ్యాస్ సప్పుల్ల కను  చూపు మేరాల్లో, పోరాట వీరుల కవాతులో
నా మనసంతా ఉవ్వేత్తున ఎగిసిన ఉద్యమం ల చేరాలని ఊగిసలాడుతునే ఉన్నది.

మొన్నటి మిలియన్ మార్చ్ లో ద్వంసం అయిన విగ్రహాల్లాంటి మహా కార్యాన్ని
పునః ప్రతిష్టించి మరో తీపి జ్ఞాపకాన్ని నా ఉద్యమ కాల పత్రం లో,
సాగర హారం లో రాలిన రక్తపు బోట్ల తో చరిత్ర లోకి ఎక్కించాలని నా మనసంత ఉవ్విళ్లూరుతున్నది .

సాగరపు ఒడ్డున తిరిగిన జ్ఞాపకాలన్నీ  నెమరు వేసుకుంటూ,
శిథిలం చేయడానికి అనువైనదాని కోసం ఆణువణువూ వెతుకుతూనే
ఉన్నాయ్ నా అక్షములు...

నిమజ్జనం అయిన వినాయకులందరూ మిమ్మల్ని మేం కాపాడుతం అంటూ
ఒడ్డుకు చేరి కావలున్నారు ...

జై తెలంగాణా జై జై తెలంగాణ 
సిరుల తెలంగాణ 

గోదారి నీళ్ళు లేక గొంతేండె రా... నా తల్లి గొంతెండెరా ...
రెండు జీవనదులున్న పుణ్య భూమిరా... నా తల్లి పుణ్య భూమిరా...
పచ్చని పంట లేవ్విరా ??? నా తల్లికి నిలువెల్లా మంట లంటేరా ...
సీర నేసే  సిరిసిల్ల రా... నా తల్లికి ముస్తాబయ్యే  సీరలేవ్విరా 
బతుకులే సిల్లరాయె గద రా ...
సిరులున్నా సింగరేణి రా నా తల్లి సిగాలోనా పువ్వులేవ్విరా???
సింగుల సీరలెవ్విరా ???
నీల్లున్న నిండుకుండ రా, నా నల్లగొండ నాగార్జున నిండు కొండ రా... 
తాగునీల్లు కరువయేర, నా నల్లగొండ ఫ్లోరైడు విషమాయె గదరా ...
విగత దేహం 

ఆత్మ శాశ్వతం దేహం కాదని
తెలిసీ తెలియక 
అశాశ్వతపు నీడలా మీద 
శాశ్వతపు మేడలు కట్టి
ఈ దేహం దాహం తీర్చడానికి 
సాగర మధనమే  చేస్తున్నాం ...


నువ్వు ద్వేషిస్తున్నావని, నిన్ను ప్రేమించడం ఆపుతనా ???